Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని బాపట్ల శాసనసభ్యులు  వేగేశన నరేంద్ర వర్మ రాజు పేర్కొన్నారు. బాపట్ల పట్టణం 20వ వార్డు భీమవారి పాలెంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ… 27,768 ఓట్ల మెజారిటీలో గెలిపించిన నా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తూ ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని అన్నారు.

ప్రభుత్వం ఏర్పాటై వందరోజులు రోజు ఇంత తక్కువ కాలంలోనే పూర్తి అయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అనేక పథకాలను అమలు చేశారన్నారు. సీఎం చంద్రబాబు పది రోజులు విజయవాడలో బస్ లోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టి రెట్టింపు సహాయాన్ని అందించారని తెలిపారు.

వృద్ధులకు అవ్వ తాతలకు పింఛన్లు ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు ఇవ్వడం ఒకటైతే… మొదటి నెల ఒక్కొక్కరికీ రూ.7000లు చొప్పున ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు.

పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్ ను పునః నిర్మాణం చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదేనని అన్నారు. వైసిపి ప్రభుత్వం ప్రజలకు నిద్ర లేకుండా చేసిన “ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను” రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించమన్నారు. మెగా డీఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతుందన్నారు.

వచ్చే దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ రవీందర్, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శివ లీలా, కమీషనర్ నిర్మల్ కుమారు,జనసేన సమన్వయకర్త నామన శివన్నారాయణ,పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు,పట్టణ బీజేపి అద్యక్షులు మామిడి రమేష్, వార్డు తెలుగు దేశం పార్టీ ప్రెసిడెంట్ అందెల మల్లేశ్వరావు,జిట్టా ప్రమీళా రాణీ,కారుమూరి అంజనేష్,చివుకుల దుర్గా ప్రసాద్ శీలం శ్రీనావాస్,కొట్రా రామకృష్ణ, మరియు నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE