– పూణేలో జరుగుతున్న పారిశుధ్య అంశంపై అధ్యయన యాత్రకు వెళ్లిన ఏపీ స్వచాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బృందం
– అక్కడి పారిశుధ్య తొలగింపు పద్ధతి బాగుందని ప్రశంస
– సీఎం చంద్రబాబుతో మాట్లాడి పూణే విధానం అమలుచేస్తామన్న పట్టాభి
పూణే: దేశంలోనీ ప్రముఖ రాష్ట్రాలలో పరిశుభ్రంగా ఉన్న నగరాలలో పారిశుధ్య నిర్వహణ ఎలా జరుగుతుందో అనే విషయంపై అవగాహన పెంచుకుని అక్కడ అవలంబిస్తున్న కార్యాచరణ నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూడా తీసుకు రావాలనే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ స్వచాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆయన సభ్యుల బృందం గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పర్యటనలు కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా మహారాష్ట్ర లోని పూణే నగరo లో అవలంబిస్తున్న ఒక వినూత్న పద్ధతి గురించి తెలుసుకున్న పట్టాభిరాం సభ్యుల బృందం, ఈ రోజు అక్కడ పర్యటించింది. పూణే నగనరం లో ర్యాగ్ పికర్స్ (చెత్త ఏరుకునే వారు) గా ఉన్న 8 వేల మంది కలిపి ఒక కోపరేటీవ్ సొసైటీనీ ఏర్పాటు చేసుకుని దానికి “స్వచ్ కోపరేటివ్ సొసైటీ”అని పేరు పెట్టుకుని, ఇంటి ఇంటికి తిరిగి తడి చెత్తని,పొడి చెత్తని సేకరిస్తున్నారని, అలా వచ్చిన తడి చెత్తని, పొడి చెత్తనీ వేరు చేసి దానిని ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కి తరలించి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్స్ కి పంపించడం ఒక ప్రక్రియగా సాగుతుందని తెలిపారు.
అయితే ఇందులో పొడి చెత్త ద్వారా వచ్చిన ప్లాస్టిక్ కవర్స్,వాటర్ బాటిల్స్,పెట్ బాటిల్స్ తదితర రిసైకిలాబుల్స్ వారు ఏర్పాటు చేసుకున్న స్వచ్ కోపరేటీవ్ సొసైటీ ద్వారా అమ్ముకుని నెలకి 25 వేల రూపాయలకి పైగా సంపాదిస్తున్నారని,ఇది చాలా గొప్ప విషయమని పట్టాభి తెలిపారు. ర్యాగ్ పికర్స్ స్వచ్ కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గా ఉన్న విద్యావతి బృందం దగ్గరుండి మరీ తడి చెత్తని,పొడి చెత్తని సేకరించే విదానాన్ని పట్టాభిరామ్ బృందానికి చూపించడం.. అలాగే దాని ద్వారా వచ్చే కోపరేటివ్ సభ్యులకి వచ్చే ఆదాయ మార్గాల గురించి వివరించడం జరిగిందని పట్టాభి తెలిపారు.
ఇలా కొత్తగా అవలంబిస్తున్న ఈ కార్యక్రమానికి పూణే లో ఉన్న ఎన్జీవో లు కూడా సహకారం అందిస్తున్నారని పట్టాభి తెలిపారు..ఈ ర్యాగ్ పికర్ (చెత్త ఏరుకునే వారి) లో దాదాపు ఎక్కువమంది మహిళలే ఉన్నారని పట్టాభి తెలిపారు. మన రాష్ట్రం లో మహిళలు ఆర్దికంగా ఎదగడానికి 25 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూప్స్ తీసుకు వచ్చారని పట్టాభి గుర్తు చేశారు.
పూణే నగరంలో అనుసరిస్తున్న ఈ నూతన పద్ధతి కచ్చితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుందని, ఇక్కడ జరుగుతున్న విధానాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి వివరించి అవసరం అయితే స్వచ్ కోపరెటీవ్ సొసైటీ బృందాన్ని ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి స్వయంగా వారు నడుపుతున్న స్వచ్ కోపరేటివ్ సొసైటీ గురించి ప్రెజెంటేషన్ తీసుకుంటామని, ఇది కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుందని దీని పై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చించి తగిన మార్గ దర్శకాలు రూపొందిస్తామని పట్టాభి తెలిపారు.