– ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కురుపాంలో విద్యార్ధులు పాము కాటుకు గురై మృతి చెందడం బాధాకరం
– ఎస్టీ కాకపోయినా ఎస్టీ హోదాలో పదవి అనుభవిస్తూ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని పుష్పశ్రీవాణి రాజీనామా చేయాలి
– రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎం.ధారు నాయక్
నేడు పుష్పశ్రీ వాణి సొంత నియోజకవర్గం కురుపాం వసతిగృహంలో విద్యార్ధులు పాము కాటుకు గురవ్వడానికి కారణం నిర్లక్ష్యం మాత్రమే. ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేవలం ఇంటికే పరిమితం అయ్యారు తప్పా ఏనాడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో పర్యటించిన ధాఖలాలు లేవు. విద్యార్ధులకు వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవ్వుతున్నా పట్టించుకోవడం లేదు. నాడు – నేడు పేరుతో పాఠశాలలను అడ్డం పెట్టుకొని దోచుకోవడం తప్పా విద్యార్ధులు బలవుతున్నా ఉప ముఖ్యమంత్రికి పట్టదా? ఐటీడీఏలో అవినీతి విచ్చలవిడి అయ్యింది. దానిని పట్టించుకునే నాధుడే లేడు. ఎస్టీలకు చెందాల్సిన నిధులన్నింటిని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేస్తున్నారు. మహిళా మంత్రి పుష్పశ్రీ వాణి ఎస్టీ కాదు కాబట్టి నేడు ఎస్టీలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు ఆమెకు కనపడటం లేదు. టిక్ టాక్ లు చేసుకుంటూ జగన్ రెడ్డి భజన చేయడం తప్పా పుష్పశ్రీ వాణికి ప్రజా రంజక పాలన అంటే ఏమిటో తెలియదు? నేడు తండాలు/గూడాలలో మంచి నీటి ఎద్దడితో ఎస్టీలు నానా రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.