– 5 వ క్లాసు టీసీలో బీసీ-సి (క్రిస్టియన్) సర్టిఫికెట్
– ఐపిఎస్ పివి సునీల్‌పై చర్య తీసుకోవాలంటూ ఎస్సీఎస్టీరైట్స్ ఫోరం ట్వీట్
– ఎస్సీ కోటాలో ఐపిఎస్ ఉద్యోగం సాధించారు
– ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే
– విచారణ కోరుతూ డీఓపీటీకి లేఖ
– క్రిమినల్ చర్య తీసుకోవాలని డిమాండ్
– తన వాదనకు మద్దతుగా, సునీల్ టీసీ- ఓ వీడియోను విడుదల చేసిన ఎస్సీఎస్టీరైట్స్ ఫోరం
– సోషల్‌మీడియాలో హల్చల్ అవుతున్న పివి సునీల్ కుల-మత ప్రస్తావన
విజయవాడ: వివాదాస్పద ఐపిఎస్ పివి సునీల్ కుమార్ తాజాగా మరో చిక్కులో ఇరుక్కున్నారు. ఆయన ఎస్సీ కాదని, బీసీ-సీ (క్రైస్తవుడు) అంటూ దానికి సంబంధించిన సునీల్ చదివిన స్కూలు సర్టిఫికెట్‌ను.. ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం తన ట్వీట్లో బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది.
పైగా మతం మారిన సునీల్ ఎస్సీ కోటాలో.. ఐపిఎస్ ఉద్యోగం సంపాదించడం రాజ్యాంగాన్ని మోసం చేయటమేనంటూ, ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం డిఓపీటీకి ఫిర్యాదు చేసింది. తన వాదనకు మద్దతుగా సునీల్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేయడం చర్చనీయాంశమయింది.
మరికొద్ది నెలల్లో రిటైరవనున్న సీనియర్ ఐపిఎస్ అధికారి పివి సునీల్ కుల-మత వివాదంలో ఇరుక్కున్నారు. సునీల్ జన్మత: బీసీ-సీ (క్త్రైస్తవుడు) అంటూ దానికి సంబంధించిన స్కూల్ టీసీని, ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం ‘ఎక్స్’ వేదికగా ఒక ట్వీట్ ద్వారా విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా బోయగూడెం సిఎస్ఐ ఎలిమెంటరీ స్కోల్ నుంచి ఆయన 623/1976 నెంబరుతో ఒక టీసీ తీసుకున్నారు.
అందులో సునీల్ బీసీ-సీ (క్ట్రిసియన్) అని, నాటి హెడ్మాస్టరు జోసఫ్ 14-6-1976న ఇచ్చిన టీసీపై సంతకం-స్టాంపు వేసినట్లు ఆ టీసీలో స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ రెండు పేజీల టీసీని.. ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం ఒక ట్వీట్ ద్వారా విడుదల చేసింది. ఇప్పుడు ఆ టీసీ ఆధారంగా సునీల్ కులం-మతంపై మళ్లీ కొత్త చర్చకు తెరలేచింది.
కాగా మతం మారినా ఎస్సీ కోటాలో ఉద్యోగం సంపాదించిన సునీల్ రాజ్యాంగాన్ని మోసం చేసినందుకు, విచారణ జరిపి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డీఓపీటీని డిమాండ్ చేసింది. డిప్యూటీ స్పీకర్ ర ఘురామకృష్ణరాజు వర్సెస్ పివి సునీల్ ఎపిసోడ్ నడుస్తున్న సమయంలో.. పివి సునీల్ ఎస్సీ కాదు. బీసీ-సీ (క్రిస్టియన్) అంటూ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం డీఓపీటీకి ఫిర్యాదు చేయడం, రఘురామరాజుకు నైతిక బలం ఇచ్చినట్లయింది.
తాజా సుప్రీంకోర్టు తీర్పులో కూడా.. మతం మారిన వారిపై ఎవరూ ఫిర్యాదు చేయనంతమాత్రాన, చర్యలు తీసుకోనంత మాత్రాన అతను తప్పించుకోలేడని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ అంశం పివి సునీల్ ఎపిసోడ్‌తో మళ్లీ చర్చల్లోకి వచ్చింది.
ఇదిలా ఉండగా.. దేశంలోని ద ళిత-గిరిజన హక్కుల కోసం, జాతీయ స్థాయిలో పోరాడుతున్న ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరం ఒక జాతీయవాద సంస్ధగా గుర్తింపుపొందింది. ప్రధానంగా దళిత కార్డుతో క్రైస్తవమతంలోకి మారిన అధికారులు, ప్రముఖులపై ఈ సంస్థ పోరాడుతోంది. నిజమైన దళిత-గిరిజన హక్కులను సంరక్షించడమే ఈ ఫోరం ప్రధాన లక్ష్యం.
https://x.com/SCSTForum/status/2036776017294197213

