ఇద్దరి అరెస్ట్
వరంగల్ : మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మానసికంగా వేధిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏం. ఏ బారి, సెంట్రల్ జోన్ డీ సి పి ఈ మేరకు వివరాలు తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంబించి, ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్నారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులకి వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఏం. జితేందర్ రెడ్డి, టాస్క్ఫోర్స్ , ఏ సి పి ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు మరియు వైద్యశాఖ సిబ్బంది తో ఫారహీన ఆసుపత్రి పై ఈ రోజు 13.03.2023 ఉదయం దాడులు చేసి, ఫేక్ డాక్టర్ ముసుగు లో క్షుద్రపూజలు చేసి చేతబడి చేసినవారికి తగ్గిస్తామని , సంతానం లేని వారికి సంతానం కలిగేలా చేస్తామని, ఆరోగ్య, ఉద్యోగం, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులతో పాటు దూర ప్రాంతాల ములుగు, కరీంనగర్, జమ్మికుంట, కొంకపాక, అదిలాబాద్ మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే పేదలను మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) అదుపులోకి తీసుకొని విచారించారు.
పోలీసు విచారణలో విస్తుపోయే నిజాలు :
వీరు ఎక్కవగా పౌర్ణమి, అమావాస్య లలో క్షుద్రపూజాలు చేసి, తన దగ్గరికి వచ్చిన వారికి వారి యొక్క రోగాలను నయం చేసే నెపం తో క్షుద్రపూజాలు చేసి, వారిని నమ్మించి అదిక మొత్తం లో డబ్బులు వసూలు చేశారు. సయ్యద్ ఖాదిర్ అహ్మెద్ గతంలో కరీంనగర్ లోని ఒక డాక్టర్ వద్ద సహాయకునిగా కొంత కాలం పనిచేసి అక్కడ వైద్యం ఏ విధంగా చేయాలో నేర్చుకొని , తన తండ్రి ఖరిముళ్ల ఖాద్రి గతంలో పూజలు చేసి తాయత్తులు కట్టేవాడు.
ఈ అనుభవం తో అతను హనుమకొండ లోని నయీంనగర్ లోని కె యు సి క్రాస్ రోడ్డు వద్ద గత 35 సం.. ల నుండి తన స్వంత భవనం లో ఫారహీన క్లినిక్ పేరిట నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతి మరియు ల్యాబూ పత్రాలు లేకుండా ఒక ఆసుపత్రి ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన రోగులకు వారి పై గిట్టని వారు చేతబడులు చేశారని, దయ్యం పట్టినధి అని, నర దృష్టి ఉంది అని, మీలో దోషాలు ఉండడం వల్ల సంతనాలు కలుగడం లేదని , ఉద్యోగాలు రావడం లేదని , కుటుంబ తగాదాలు పరిష్కారం కోసం వారికి లేని పోనీ భయలును కలిగించి క్షుద్రపూజాలు చేసి వాటిని పరిష్కరిస్తానని ఒక్కొక్కరి దగ్గరి నుండి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.
కొంతమంది దీర్గ కాలం ట్రీట్మెంట్ ఇస్తూ డబ్బులు దోచుకోవడం చేస్తున్నాడు. కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటానికి వారికి ఆలోపతి మందులు మంత్రించి ఇస్తున్నట్లు ఇచ్చి అవి వాడిన తరువాత రోగం నయం అయితే క్షుద్రపూజాలు వలనే చేయడం వల్లనే తగ్గినధి అని నమ్మిస్తున్నారు. ఇతను హన్మకొండ లోనే కాకుండా హైదరాబాద్ లో మరియు కొంత మంది రోగుల స్థితి ని బట్టి వారి యొక్క స్వస్థలకి వెళ్ళి క్షుద్రపూజాలు నిర్వహిష్టడు. ఇతనికి ఇట్టి క్షుద్రపూజాలు కు సహాయకులు గా ఉన్న సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) తండ్రి పేరు నూర్ నివాసం ఉప్పల్, హైదరాబాద్ అదుపులోకి తీసుకొనినది. ఇట్టి క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా మరియు అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ వారు పరారీలో ఉన్నారు.