Suryaa.co.in

Telangana

విద్యుత్ బిల్లుపై క్యూఆర్ కోడ్ 

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై ఇకపై క్యూఆర్ కోడ్ ను ముద్రించనున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నను, ప్రస్తుతానికి బిల్లు వసూళ్లపై ప్రభావం పడలేదు.

ఈ రోజు ఉదయం పది గంటల వరకు దాదాపు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు.  ప్రస్తుతం సంస్థ వెబ్సైటు, మొబైల్ యాప్ నుంచి బిల్ డెస్క్ – పీజీఐ, పేటీఎం – పీజీ, టీఏ వాలెట్, టీజీ / ఏపీ ఆన్లైన్, మీసేవ, టి – వాలెట్, బిల్ డెస్క్ (ఎన్ఏసీహెచ్) ద్వారా బిల్లులు చెల్లించవచ్చు. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE