– విలేఖర్ల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
ఏలూరు: వివిధ వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలను నేరుగా కలవడం కోసం సారథ్యం యాత్ర చేపట్టాం. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టాం. సమాజం గుర్తించని వర్గాలకు చేయూత ఇస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడ బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. అణగారిన, గుర్తింపులేని వర్గాల వారికి గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం.
ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకుని పార్టీని అభివృద్ధి చేసేలా ముందుకు వెళ్తున్నాం. అన్ని వార్గాల్లోకి పార్టీ వెళ్లేలా కృషి జరుగుతుంది. ప్రజలు పూర్తిగా పార్టీని ఆదరిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న అపరిష్కృత అంశాల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఎవరు ఆందోళనలో లేరు. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పుట్టి… దగాకోరు పార్టీగా మారింది. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డంపెట్టుకుని ఎదగాలని చూసిన పార్టీ. బీజేపీ పురాతన పార్టీ… కొత్త పాత కలయిక బీజేపీ. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభావవంతమైన స్థానంలో బీజేపీ ఉంది.