-ఆయన విషయంలో ఏదైనా జరగవచ్చు
-2024 ఏపీ ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీలు ఉమ్మడిగా అధికారంలోకి రావడానికి కృషి చేస్తాం
-బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం లో శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొని ప్రసంగించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీ కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారని రఘురామరాజు విషయంలో ఏదైనా జరగవచ్చు అని బీజేపీలో రఘురామరాజు జాయిన్ అవుతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీలు ఉమ్మడిగా అధికారంలోకి వచ్చేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో మెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే ప్రత్యక్షంగా 2 లక్షలు పరోక్షంగా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో కాకినాడ మెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభం కాలేదు అన్నారు. రైల్వేలైన్ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు ఇవ్వకపోతే త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తాం ఆని ఆయన హెచ్చరించారు. రాజధాని అమరావతిలో బిజెపి ఎన్నో కేంద్ర సంస్థలను నెలకొల్పింది అని గత ప్రభుత్వ హయాంలో అమరావతి లో ఏడు వేల కోట్లు ఖర్చుపెట్టి మొండి గోడలే మిగిలాయి అన్నారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 14 వేల కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం 32 వేల కోట్లు ఖర్చు చేస్తోంది అని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగనన్న ఇళ్ల అని పేరు పెట్టడం సమంజసం కాదన్నారు. జగనన్న ఇళ్ల స్థలాల కొనుగోలు పేరుతో వైసీపీ నేతలు ఐదు వేల కోట్ల వెనకేసుకున్నరు అని సోము వీర్రాజు ఆరోపించారు.