Suryaa.co.in

Editorial

రఘురామరాజు.. సీఐడీ దెబ్బలు.. ఒక క్విడ్ ప్రో కో!

– గుంటూరులో డాక్టర్ ప్రభావతి బిల్డింగ్.. ప్రత్యేకం!
– రఘురామకృష్ణంరాజును చిత్రహింలు పెట్టిన నాటి సీఐడీ
– ఆయనకు గాయాలేమీ లేవని సర్టిఫై చేసిన డాక్టర్ ప్రభావతి
– సంబంధం లేని వైద్యులతో రఘురామరాజుకు వైద్య పరీక్షలు
– కేసు షీటు కూడా ఇవ్వని దారుణం
– గుంటూరు వైద్యుల నివేదికను కొట్టిపారేసిన సికింద్రాబాద్ మిలటరీ వైద్యులు
– కాళ్లకు గాయాలయ్యాయని ధృవీకరణ
– డాక్టర్ ప్రభావతి భర్త వైసీపీలో కీలకనేత
– అందుకే ర ఘరామరాజుకు వ్యతిరేకంగా సర్టిఫికెట్
– అందుకు నజరానాగా ప్రభావతి బిల్డింగుకు అడ్డగోలు సేచ్ఛ
– వచ్చిన అనుమతులకంటే అదనపు నిర్మాణాలు
– ఇచ్చింది మూడు.. కడుతున్నది ఐదు ఫోర్లు
– పేరు రెడెన్షియల్.. తీరు పక్కా కమర్షియల్
– సెల్లారుకు ఎవరు అనుమతి ఇచ్చారు?
– రోడ్డు ముద్దుకొచ్చి దర్జాగా మరీ కబ్జా
– అక్కడ రోజూ గంటలపాటు ట్రాఫిక్ జామ్
– చర్యలకు భయపడిన నాటి జీఎంసీ బాసులు
– ప్రభుత్వం మారినా ఇంకా అదే సుఖనిద్ర
– రఘురామరాజు కేసులో ఇదో ‘క్యిడ్ ప్రో కో’
– సర్కారు మారినా ఇంకా కొనసాగుతున్న ప్రభావతి బిల్డింగ్ అదనపు అక్రమ నిర్మాణ పనులు
( అన్వేష్)

డాక్టర్ ప్రభావతి పేరు విన్నారా?.. వినలేదా? ఓకే.. ఓకే.
పోనీ.. నాటి వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్లి, గుంటూరు ఆఫీసులో చావచితగ్గొట్టి.. పాదాలను పచ్చడి చేస్తున్న దాడి దృశ్యాలను ‘ప్యాలెస్ పాలకుడి’కి లైవ్‌లో చూపించి, వికృతానందం పొందిన ఘటన గుర్తుందా?

యస్. అదే కేసులో రాజుకు కించిత్తు దెబ్బ కూడా తగలలేదని, అయన పాదాలు కడిగిన ముత్యంలా ఉన్నాయంటూ, నాటి గుంటూరు జనరల్ ఆసుపత్రి బాసు డాక్టర్ ప్రభావ తి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి.. సర్కారుకు అనుకూలంగా సంతగించిన వైనం గుర్తుందా?..
అవును.. ఆ ప్రభావతే.. ఈ డాక్టర్ ప్రభావతి!
ఎప్పుడో జరిగిన యవ్వారం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందనేకదా అందరి డౌటనుమానం?

మామూలుగా అయితే గుర్తుండేది కాదు. కానీ ఆ క్విడ్ ప్రో కో కేసు తాలూకు పనులు ఇంకా కొనసాగుతున్నాయ్.. అదీ అసలు యవ్వారం. ఇక గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్‌లో, మెయిన్‌రోడ్‌పై దర్జాగా జరుగుతున్న డాక్టర్ ప్రభావతి బిల్డింగ్ రోడ్డు కబ్జా కథేమిటో తెలుసుకుందాం.

అది కరోనా కల్లోల కాలం.. ఆ సమయంలో నాటి సీఎం జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పి, ఒంటికాలితో లేచి నాటి సర్కారుపై సమరశంఖం పూరించిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును.. సీఐడీ పోలీసులు అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఆయన ఇంట్లోకి చొరబడి ఎత్తుకొచ్చి, గుంటూరులో పడేశారు. ఆ సందర్భంగా ఆయనను గుంటూరు సీఐడీ ఆఫీసులోనే ఇంటరాగేషన్ చేశారు.

ఆ సమయంలో సీఐడీ పోలీసులు, రఘురామరాజుపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తనను కొడుతున్న దృశ్యాలను జగన్‌రెడ్డికి చూపించి వికృతానందం పొందారని, ఈ ఘటనకు సీఐడీ చీఫ్ సునీల్, విజయపాల్ బాధ్యులని స్వయంగా రఘురామరాజే మీడియాకు వెల్లడించారు. పార్లమెంటులో ప్రివిలేజీ మిటీ, మానవ హక్కుల సంఘం, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అది వేరే కథ.

అప్పుడు రఘురామరాజును కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయనకు వైద్యపరీక్షలకు జడ్జి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఆ ప్రకారంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో, రాజుకు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు లేవని నాటి సూపరెంటెండెంట్.. డాక్టర్ ప్రభావతి కోర్టుకు నివేదిక ఇచ్చారు.

కారణం.. డాక్టర్ ప్రభావతి భర్త అప్పటి అధికారపార్టీ వైసీపీ లీగల్ సెల్‌లో క్రియాశీల నేత కావడమేనని, అందుకే తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఎంపీ రాజు అప్పుడే ఆరోపించారు. అసలు తనను ప్లాన్ బీలో భాగంగా.. ఆసుపత్రిలోనే చంపించేందుకు ఒక కార్టియాలజిస్టును కూడా సిద్ధం చేశారని, ఆయన పేరును ప్రత్యేకంగా సిఫార్సు చేశారని.. ఇప్పటి ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఇటీవలే వెల్లడించిన విషయం తెలిసిందే.

డాక్టర్ ప్రభావతి నివేదికపై నమ్మకం లేని రఘురామరాజు రోడ్డు మార్గంలో పోలీసు భద్రత నడుమ సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి వెళ్లడం, అక్కడ ఆయన పాదాలకు అయిన గాయాలు నిజమేనని మిలటరీ డాక్టర్లు ధృవీకరించడం జరిగిపోయింది. దానితో డాక్టర్ ప్రభావతి, వైసీపీ నేత అయిన తన భర్త ఒత్తిడి మేరకే తప్పుడు నివేదిక ఇచ్చారన్నది తేలిపోయినట్లయింది.

అదే సమయంలో సికింద్రాబాద్ మిలటరీ వైద్యులపై నాటి టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి ఒత్తిళ్లు చేసి, డాక్టర్ ప్రభావతి నివేదిక నిజమని సర్టిఫై చేయాలని కోరిన వైనాన్ని రాజు బట్టబయలు చేశారు. ఎందుకంటే ధర్మారెడ్డి కూడా డిఫెన్స్ సర్వీసు కాబట్టి.

ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి, టీడీపీ గద్దెనెక్కిన తర్వాత సీఐడీ చీఫ్ సునీల్ సహా.. నాటి ఘటనలో పాల్గొన్న వారిపై రఘురామరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు దానిని ఎఫ్‌ఐఆర్ చేయడం చకచకా జరిగిపోయింది. అయితే ఇప్పటివరకూ ఆ కేసు విచారణ అధికారి ఎవరో తెలియదు. కేసు ఇదీ రఘురామకృష్ణంరాజు.. సీఐడీ.. డాక్టర్ ప్రభావతి కథ.

సీన్ కట్ చేస్తే.. మళ్లీ అదే గుంటూరు..సీఐడీ ఆఫీసుకు కొద్దిగా దూరంలోని రెడ్డిపాలెం.

గుంటూరు రెడ్డిపాలెం-2 ఇన్నర్ రింగ్‌రోడ్ చాలా చిన్నది. కానీ ట్రాఫిక్ ఎక్కువ. విజయవాడ వెళ్లేందుకు అది దగ్గరదారి. అందుకే అక్కడ రోజూ గంటలపాటు ట్రాఫిక్ జామవుతుంటుంది. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద భవనం నిర్మాణంలో ఉంది. సుమారు ఆరు అడుగుల రోడ్డును మింగేస్తూ, నిర్భయంగా రోడ్డు ముందుకొచ్చి భవనం కడుతున్న దృశ్యం దర్శనమిస్తోంది. మూడు ఫ్లోరకు అనుమతి తీసుకుని ఐదు ఫోర్లు అడ్డగోలుగా కడుతున్న ధిక్కారం సర్కారును వెక్కిరిస్తోంది.

ఫలితంగా అసలే చిన్న రోడ్డుపై ఆరడుగులు ముందుకొచ్చి కడుతున్న భవనం వల్ల ఇంకా ట్రాఫిక్ జాం. ఆ భవనం పేరు ప్రభావతి బిల్డింగ్. ఆ బిల్డింగ్‌కు ఆ పేరే పెట్టారు మరి.

ఇంతకూ ఈ ప్రభావతి ఎవరంటే.. నాడు రఘురామకృష్ణంరాజును పోలీసులు చావచితగ్గొట్టినప్పటికీ.. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆయన నిక్షేపంగా ఉన్నారంటూ జగన్ సర్కారుకు అనుకూల నివేదిక ఇచ్చిన ఆ డాక్టర్ ప్రభావతి బిల్డింగే ఈ ప్రభావతి బిల్డింగ్.

రవికుమార్ పేరుతో మునిసిపల్ కార్పొషన్‌కు రెసిడెన్షియల్ బిల్డింగ్ నిర్మాణం కోసం 2022, ఫిబ్రవరి 4న పెట్టుకున్న దరఖాస్తు అది. ఆ దరఖాస్తు ప్రకారం.. ప్రభావతి బిల్డింగుకు స్టిల్ట్ ప్లస్ మూడు ఫోర్లతో రెసెడెన్షియల్ భవన నిర్మాణానికి, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ టన్‌ప్ల్రానింగ్ అనుమతి ఇచ్చింది. ఆ ప్రకారంగా స్టిల్ట్ ఫ్లోర్‌లో 76.26 స్క్వేర్ మీటర్లు, గ్రౌండ్ ప్లోర్‌లో 99.56 స్క్వేర్ మీటర్లు, మొదటి-రెండు ఫ్లోర్లలో 199.12 స్క్వేర్ మీటర్ల మేరకు ప్రభావతి భవనం నిర్మించాలి. ఇంక అంతకుమించి అదనపు నిర్మాణాల ముచ్చటే ఆ పత్రంలో లేదు.

కానీ అదేదో సినిమాలో నూతన్‌ప్రసాద్ చెప్పినట్లు.. ఊరుమనదే తోసెయ్ మాదిరిగా.. అప్పట్లో ప్రభుత్వం మనదే కాబట్టి.. అందునా రఘురామరాజును సీఐడీ కొట్టిన కేసులో సర్కారుకు శ్రమదానం చే సి, జగన్న పెదవులపై ‘షిక్కటి షిరునువ్వు’ పూయించారు కాబట్టి.. కార్పొరేషన్ నుంచి తీసుకున్న అనుమతులను తుంగలోతొక్కి , తమకు నచ్చిన సొంత నిర్మాణానికి తెరలేపారు.

మరి ఇవన్నీ రోజూ ఒళ్లంతా కళ్లు చేసుకుని తిరిగే టౌన్‌ప్లానింగ్ అధికారులకు తెలియదా అంటే.. తెలుసు. కాకపోతే పట్టించుకోరంతే. కారణం ‘మామూలే’. పైగా జగనన్న పార్టీ నాయకుడు కదా? చర్యల కొరడా ఝళిపిస్తే కొంపకొల్లేరయి, శంకరగిరిమాన్యాలు పట్టడం ఎందుకన్న భయం. ఏబీ వెంకటేశ్వరరావు, ఎల్వీ అన్న లాంటివారికే దిక్కు లేదు. ఇక తామెంత? అందుకే ఆ భయంతోనే అధికారులు మత్తులో కళ్లు మూసుకున్నారు.

ప్రస్తుతం ప్రభావతి బిల్డింగ్ నిర్మాణం.. నిబంధనలకు పాతరేసి, వాయువేగంతో నిర్మాణమవుతోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా సరే.. లెక్కలేకుండా, ఇంకా తమ వైసీపీ సర్కారే ఉందన్న ధీమాతో నిబంధనలసు సమాధి చేసి, బిల్డింగ్‌ను శరవేగంగా కడుతున్నారు. అనుమతి పత్రంలో లేని సెల్లార్ కడుతున్నారు. సెల్లార్ కట్టాలంటే బోలెడు అనుమతుల వ్యవహారాలు, సవాలక్ష కొర్రీలు దాటాలి. కానీ ప్రభావతి బిల్డింగ్‌కు అవేమీ అడ్డురాలేదు. ఎందుకంటే అది నాటి వైసీపీ సర్కారు ఇచ్చిన భరోసా కాబట్టి!

పైగా అనుమతి తీసుకున్నది రెసిడె న్షియల్ పర్పస్. అంటే నిర్మాణాలు కూడా వందకు వందశాతం దానినే అనుసరించాలి. కానీ దాన్ని నిర్భయంగా కమర్షియల్‌గా మార్చేసి.. స్టిల్ట్ ఫ్లోర్‌లో కమర్షియల్ షోరూం కట్టారు. మిగిలిన ఫ్లోర్లదీ అదే కథ. పోనీ ఇచ్చిన అనుమతుల ప్రకారం.. సెట్‌బ్యాక్ ఏమైనా వదిలారా అంటే.. నిర్భయంగా, సుమారు ఆరడుగులు ముందుకొచ్చి కట్టేశారు. ‘అంత పద్థతి’గా బిల్డింగ్ కడుతున్నారన్నమాట!

నిర్మాణంలో ఉన్న ప్రభావతి బిల్డింగ్ భవనాన్ని.. దానికి అటు ఇటుగా ఉన్న మిగిలిన భవనాలకు పరిశీలిస్తే.. నిబంధనలను ఎన్ని కిలోమీటర్ల లోతున పాతరేశారో అర్ధమవుతుంది. ‘పిల్లిగుడ్డిదైతే ఎలుక ఏదో చూపించింద’న్న ముతక సామెత.. ప్రభావతి బిల్డింగ్ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదే పని ఏ సామాన్యుడో చేస్తే మాత్రం, టౌన్‌ప్లానింగ్ అధికారులు అగ్గిరాముళ్లయిపోతారు. నోటీసులు పంపి నానా గత్తర చేస్తారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే, బుల్డోజరు తీసుకువచ్చి కూల్చిపారేస్తారు. మరి ప్రభావతి బిల్డింగ్ లోనే ఎందుకు మినహాయింపులంటే.. ఆ సామాన్యులంతా రఘురామకృష్ణంరాజులు కాదు. వారిని సీఐడీ పోలీసులు చావచితకొట్టలేదు కాబట్టి! పోలీసులు కొట్టలేదని ప్రభావతులు సర్టిఫై ఇవ్వలేదు కాబట్టి!!. అంతకుమించి.. వారెవరూ వైసీపీ నాయకులు కాదు!!! జస్ట్ ఇదో క్విడ్ ప్రో కో. ఇంకా అర్ధం కాలేదా?.. రఘురామకృష్ణంరాజును చావచితగొట్టి, సూరి బావ మాదిరిగా, జగనన్న కళ్లలో మెరుపులు చూపినందుకు ప్రభావతి బిల్డింగు అడ్డగోలు నిర్మాణానికి ఇచ్చిన నజరానా అన్నమాట.

అది ఓకే. అప్పుడ ంటే జగనన్న అధికారంలో ఉన్నారు కాబట్టి అన్నీ అడ్డగోలుగా చేశారు. మరి చంద్రన్న సర్కారు వచ్చి రెండునెలలవుతోంది కదా? ఇంకా ప్రభావతి బిల్డింగుపై మున్సిపల్ అధికారులు చర్యల కొరడా ఎందుకు ఝళిపించలేదు? నిర్భయంగా ఆరడుగులు మోర ఎత్తుకుని ముందుకువచ్చిన ఆ భవన అక్రమ నిర్మాణాలను, ఎందుకు కూల్చివేయలేదన్నదే ఆశ్చర్యం. అంటే.. పాలకులు ఎవరున్నా.. పార్టీలు మారినా.. అధికారులు వాళ్లే కదా?.. అద్గదీ సంగతి!

అయితే.. తాను వచ్చి ఏడాదే అవుతోంది కాబట్టి తనకు ఈ విషయం తెలియదని, వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని గుంటూరు సిటీప్లానర్ ప్రదీప్ ‘మహానాడు’కు వివరణ ఇచ్చారు. ప్రభావతి బిల్డింగ్‌పై అధికారుల ప్రభావం ఇంకా ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి.

LEAVE A RESPONSE