– బీసీ ధర్నాపై ఇదేనా వారి చిత్తశుద్ధి?
– రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్
-మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదు. మాకు బీసీ కన్న బిహారే ముఖ్యమని మల్లిఖార్జున ఖర్గే రాలేదు.
మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యింది.
‘‘మేం గుజరాత్ లో అడగలేదు, ఉత్తర్ ప్రదేశ్ లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు. తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే.. అదే సమయంలో రాహుల్ గాంధీ గారూ.. ‘‘ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం’’ అని ట్వీట్ చేస్తరు.
ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో రెండు నాల్కల దోరణి చూస్తేనే అర్థమవుతున్నది.