– అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ
– టీఆర్ఎస్ ఎల్పీ లో ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్
ఈ సందర్భంగా తలసాని ఏమన్నారంటే.. వరంగల్ సభలో ప్రకటించిన డిక్లరేషన్ ఆచరణ సాధ్యం కానిది. డిక్లరేషన్ రాష్ట్రానికి సంబంధించిందా?, దేశానికి సంబంధించిందా స్పష్టత లేదు. రాష్ట్ర బడ్జెట్ ఎంత…. హామీల అమలుకు అయ్యే ఖర్చు ఎంత?రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషి యన్. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వ్యవసాయం లాభసాటిగా మారింది.
60 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు ఏం చేశారో చెప్పగలరా? నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా ధర్నా చేస్తే ఎక్కడికి పోయారు. పదే పదే తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన పోరాటానికి తలొగ్గి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనే విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రం తీసుకొచ్చిన నల్లచట్టాలను రైతుల పోరాటంతోనే వెనక్కు తీసుకొంది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించింది. ఢిల్లీ నుండి నేతలు రాష్ట్రానికి టూరిస్ట్ లుగా వచ్చి వెళుతున్నారు…వారితో ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని ఎకరాల భూమి సాగు అవుతుందో చర్చకు… పరిశీలనకు బీజేపీ నేతలు సిద్ధమా? ఆరుగాలం రైతులు శ్రమించి పండించిన పంటను కేంద్రం కొనబోమంటే రాష్ట్రం కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అందించిన చేయూత తో దేశానికి అన్నపూర్ణగా రాష్ట్రం నిలిచింది.