Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీ ఐరాన్ లెగ్గు…

ఎక్కడ అడుగు పెట్టిన కాంగ్రెస్ 94 శాతం ఓడింది. గెలిచింది 6 శాతం. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడ్రస్ గల్లంతు ఇక్కడ ఉద్దరిస్తర.. కాంగ్రెస్ ఇక గత చరిత్ర.రైతులకు బిజెపి చేసిన ఒక్క పని చెప్పండి.అభివృద్ధి విషయంలో టీఆరెఎస్ నిజాయతీ అయితే, బిజెపి తొండి పంచాయతీ.బాన్సువాడ లో జకోరా ఎత్తిపోతల పథకానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..

మంత్రి కామెంట్స్….
మనం ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్, బిజెపి వాళ్ళ కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రములో పంట పండితే వాళ్ల గుండె మండుతున్నది.ఏడేళ్ళలో 99 లక్షల టన్నుల నుండి 2.59 లక్షల టన్నుల వరి ధాన్యం పండింది. ముఖ్యమంత్రి గారి కృషి వల్లనే సాధ్యమైంది.మంత్రులు డిల్లీకి వెళ్లి యాసంగి వడ్లు కొనాలి అంటే.. అవమానించారు. పీయూష్ గోయల్ మంత్రం వేశారా ఇంత పంట ఎలా పండింది అంటరు. ఈరోజు దేశానికి అన్నం పెట్టే దన్యంగారం తెలంగాణ.

రైతులు నష్ట పోవద్దని మేమే కొనుగోలు చేస్తాం అని, 3000 కోట్లు అయినా భరించేందుకు ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చారు.గతంలో నీళ్ల కోసం నిజామాబాద్, బాన్సువాడ లో నిరహార దీక్షలు చేసాము. కానీ ఇప్పుడు ముఖాన్ని మొగులు వైపు పెట్టీ చూడాల్సిన అవసరం లేదు.మల్లన్న సాగర లో గేటు ఎత్తితే, నిజాం సాగర్ కు నీళ్ళు వస్తయి. జకోర లిఫ్ట్ పెడితే మీ ఊల్లతో నీళ్ళు వస్తాయి.

LEAVE A RESPONSE