– రేవంత్ రెడ్డి, మీ నాయకులను చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
– రాసిపెట్టుకో రాజేందర్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు మీ నాలుకలు కట్ చేస్తారు
– రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
హైదరాబాద్: జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ప్రజలు మీకు చెప్పు చీపిర్లతో సన్మానం చేసే రోజు దగ్గరలోనే ఉన్నది. రాజేందర్ రెడ్డి కేటీఆర్ కి వెంటనే క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, తెలంగాణ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను కేటీఆర్ కొట్టడం కాదు, ప్రజలు కొట్టడానికి సిద్దంగా ఉన్నారు.
వరంగల్ జిల్లాకు వచ్చినాడు రైతుల డిక్లరేషన్ పేరిట రైతులు మోసం చేసినందుకు, అశోక్ నగర్ వచ్చి చెప్పిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ? జాబ్ క్యాలెండర్ ఏమయింది అని నిరుద్యోగులు చెప్పులతో కొడతారు.
ముందుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేసే పని చెయ్ లేకపోతే నగర ప్రజలు మిమ్మల్ని చెప్పు, చీపుర్లతో కొడతారు. భద్రకాళి సాక్షిగా మేడారం సమ్మక్క, సారక్క సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేక చేతులు ఎత్తిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మీ నాయకులను చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
గ్రామాలకు వెళ్తే మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఎక్కడ మహిళలు చెప్పులతో కొడతారు. కళాశాలలకు వెళ్తే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఎక్కడ విద్యార్థులు చెప్పులతో కొడతారు .. ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ ? 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవి అని ? విద్యార్థినులు చెప్పులతో కొడతారు.
పొలాలకు, యూరియా పంపిణీ కేంద్రాలకు వెళ్తే రైతుభరోసా ఏది ? రైతు బీమా ఏమయింది ? రుణమాఫీ ఎక్కడ పోయింది? యూరియా కొరత ఎందుకు ? కరంటు కోతలు ఎందుకు అని రైతులు చెప్పులతో కొడతారు.
మాకేది రైతుభరోసా ? అని కౌలు రైతులు, ఎక్కడ పోయింది ఏడాదికి రూ.12 వేల సాయం ? అని రైతు కూలీలు చెప్పులతో కొడతారు.డీఎలు ఎక్కడ ? పీఆర్సీ ఏది ? అని ఉద్యోగులు, పదవీ విరమణ బకాయిలు ఎక్కడ అని ? పదవీవిరమణ చేసిన ఉద్యోగులు చెప్పులతో కొడతారు
రూ.4 వేల ఫించను ఎక్కడ అని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, రూ.6 వేల ఫించన్ ఎక్కడ అని దివ్యాంగులు చెప్పులతో కొడతారు. అధికార మదంతో అంగరక్షకుల సాయంతో కాంగ్రెస్ సర్కార్ కాలం గడుపుతున్నది
ఆరు గ్యారంటీలు, 420 హామీలతో తెలంగాణ సబ్బండ వర్ణాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. హైడ్రాతో పేదల ఉసురు, ఉద్యోగాలు వేయక నిరుద్యోగుల ఉసురు, రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు చేయక రైతుల ఉసురు, ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయక విద్యార్థుల ఉసురు తగిలి కాంగ్రెస్ సర్కారు మట్టిగొట్టుకుని పోతుంది
కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేదు. ప్రజలిచ్చిన అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు .. దోచుకోవడం, దాచుకోవడం పాలసీగా పెట్టుకున్నారు. 60 ఏండ్లు తెలంగాణను ఆగం చేసి, యువకులు, మేధావుల బలిదానాలకు కారణం అయినా మార్పు అంటే మారుతారు అని నమ్మి ఓట్లేస్తే అభివృద్ధి చెందిన తెలంగాణను వందేళ్లు వెనక్కి నెట్టింది రెండేళ్ల కాంగ్రెస్ పాలన.