Suryaa.co.in

Telangana

రాహుల్ పీఎం అయ్యేది లేదు ఏం లేదు ..దోశలు వేసుకుంటూ వుండాల్సిందే

రాహుల్ వి లేకి మాటలు
ముదిరాజ్ లంటే కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం
బండి సంజయ్ ఛత్తీస్ ఘడ్ లో స్టార్ కాంపైనర్ గా వెళ్లి ఏ భాష లో మాట్లాడుతారు?
శివ సేన తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది?
ఎంఐఎం ఎపుడూ తాను ముస్లిం ల కోసమే పని చేస్తామని చెప్పలేదు
కాంగ్రెస్ అంటే కుంభ కోణాల కుంభ మేళా
బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు చిట్ చాట్

ఎన్నికల వేళ విపక్షాలపై పంచులమీద పంచులు విసురుతున్న బీఆర్‌ఎస్‌ ఉత్తరాధికారి, మంత్రి కేటీఆర్‌.. మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంలోనూ ప్రత్యర్ధులపై పంచ్‌లు విసిరారు. ఇటీవల దోశ వేసిన రాహులునుద్దేశించి.. ఇక రాహుల్‌ దోశలు వేసుకోవలసిందే అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఈటల రాజేందర్‌నే, బీజేపీ అభ్యర్ధిగా నిలబెడతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిట్‌చాట్‌లో కేటీఆర్‌ ఏమన్నారంటే…

ఈ ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం.మేము అభ్యర్థులను ప్రకటించి సరిగ్గా రెండు నెలలు అయ్యింది.90 శాతం బీ ఫారం లు ఇచ్చాము.మేము అన్నింట్లో ముందున్నాం ..రేపు ఫలితాల్లో కూడా ముందుంటాం.కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులు లేరు. బీజేపీ ముందే రేసు నుంచి తప్పు కున్నట్టు ఉంది.

ఆ పార్టీ కి 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయం.మాకు గతం లో కన్నా మంచి స్థానాలు గెలువ బోతున్నాం.కేసీఆర్ పట్ల ప్రజల్లో అచంచల విశ్వాసం ఉంది.ఉద్యోగ నియమాకాల్లో కాంగ్రెస్ సంవత్సరానికి వెయ్యి భర్తీ చేస్తే మేము 13 వేలు భర్తీ చేశాము.ఏ రంగం లో చూసినా కాంగ్రెస్ కన్నా ఎన్నో రెట్లు ప్రగతి చేసి చూపాం.అది మెడికల్ కాలేజీలు కావచ్చు ..సాగునీటి రంగం కావచ్చు ,విద్య ,వైద్యం కావచ్చు అది ఏ విషయం లో నైనా కేసీఆర్ కు కాంగ్రెస్ కు పోలికే లేదు.

వాళ్ళ పాలన కాలం లో 20 శాతం కూడా మేము పాలన చేయలేదు ..అయినా ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి చూపాం.రాహుల్ గాంధీ సాండ్ మాఫియా అనడం విచిత్రంగా ఉంది.దేశం లో అద్భుతమైన ఇసుక పాలసీ తెలంగాణ లో ఉంది.కాంగ్రెస్ హయం లో కన్నా ఎన్నో రెట్లు ఇసుక మీద రాష్ట్రానికి ఆదాయం సంపాదించాం.విద్యుత్ సామర్ధ్యాన్ని 25 వేల మెగావాట్లకు తీసుకెళ్లాం.

బీ ఆర్ ఎస్ పై ఓటర్ల అభిమానం చెక్కుచెదరలేదు. మేము బలహీనంగా ఉన్నామనుకున్న నియోజకవర్గాల్లో కూడా పుంజుకున్నాం.పోయిన సారి కూడా సర్వేలు మాకు తక్కువ సీట్లు ఇచ్చాయి.ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డానికి రంగు వేసుకుని సీఎం పదవికి రేడీ అయ్యారు. ఆ సర్వేలన్నీ పటాపంచలు అయ్యాయి ..ఈ సారి కూడా అదే జరుగుతుంది. నల్లగొండలో ఈ సారి కూడా అన్నీ సీట్లు గెలుస్తాం.

కాంగ్రెస్ ఏం పందిరి వేసిందని నల్లగొండ లో ఆ పార్టీ కి ఓట్లు వేస్తారు.దళిత బంధు లాంటి పథకం దేశం లో ఎక్కడా లేదు.దశల వారీగా దళిత బంధు దళిత కుటుంబాలు అందరికీ వర్తిస్తుంది.కాంగ్రెస్ బీజేపీ లు ఆలు మగలు లా మారాయి.కాంగ్రెస్ బీజేపీ లు కౌగిలించుకుంటాయి కన్ను గీటుకుంటాయి.

శివ సేన తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది.ఎంఐఎం ఎపుడూ తాను ముస్లిం ల కోసమే పని చేస్తామని చెప్పలేదు. బీ ఆర్ ఎస్ బీజేపీకి బీ టీం కాదు.కాంగ్రెస్ దేశానికి సీ టీం చోర్ టీం. .కాంగ్రెస్ అంటే కుంభ కోణాల కుంభ మేళా.మైనారిటీ లకు దేశం లో ఎవ్వరూ చేయని మేలు మేము చేసాం ..బీజేపీ కి మేము బీ టీం. అయితే మైనారిటీలకు ఇంత మేలు ఎలా చేస్తాం.

రాహుల్ పీఎం అయ్యేది లేదు ఏం లేదు ..దోశలు వేసుకుంటూ వుండాల్సిందే.రాహుల్ వి లేకి మాటలు. .ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నీతులు చెబుతోంది. రాహుల్ గాంధీ ఏ హోదా లో హామీలు ఇస్తున్నారు. ప్రధాని నోరు తెరిస్తే అబద్దాలే.బండి సంజయ్ ఛత్తీస్ ఘడ్ లో స్టార్ కాంపైనర్ గా వెళ్లి ఏ భాష లో మాట్లాడుతారు. బీజేపీ 119 స్థానాల్లో రాజేందర్ నే అభ్యర్థిగా దింపుతుందేమో.

రేపు అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా వార్ రూం ఇంచార్జీల మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. మేనిఫెస్టోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని చర్చిస్తాం.ప్రతిపక్షాల తీరు వల్లే ఉద్యోగ నియామకాలు ఆలస్యం.వచ్చే సారి జాబ్ కేలండర్ ను పటిష్టంగా అమలు చేస్తాం ..tspsc ని మరింత బలోపేతం చేస్తోంది.

ఈ సారి ఈటెల రెండు చోట్ల ఓటమి ఖాయం.కుల గణన పై మేమే ముందు స్పందించాం.అసెంబ్లీ లో తీర్మానం మేమే ఆమోదించాం.రాహుల్ గాంధీ తాను లేచినపుడే తెల్లారింది అనుకుంటున్నాడు.జర్నలిస్టు ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.జర్నలిస్టు ల ఇంటి స్థలాల పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది ..ఏనుగు ఎల్లింది తోక చిక్కింది. ..తప్పని సరిగా జర్నలిస్టుల్ల సమస్య పరిష్కరిస్తాం.

ముదిరాజ్ లంటే కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం.అందుకే ముదిరాజ్ ను రాజ్యసభకు పంపారు.ఇక్కడ ముదిరాజ్ కు కీలక మంత్రి పదవి కూడా ఇచ్చారు.ఈటెల మా పార్టీ నుంచి వెళ్లిపోయారు.రాబోయే రోజుల్లో ముదిరాజ్ లకు మండలి లో నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తాం

LEAVE A RESPONSE