– ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు లకు ధన్యవాదాలు
-ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ : కేంద్రమంత్రి వర్గంలో ఏపీకి ప్రాధాన్యత కల్పిస్తూ అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినందకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, ఇందుకోసం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.