అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో వందలాది యువకులు హింసకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల వెనుక డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిన సంగతి విదితమే. ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు రైల్వే పోలీసుల అదుపులో ఉన్నారు.
మరోవైపు సాయి డిఫెన్స్ అకాడమీకి తాజాగా రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీ ఉద్యోగార్థులను రెచ్చగొట్టారనే ఆరోపణల నేపథ్యంలో రైల్వే చట్టంలోని 1989 కింద నోటీసులు ఇచ్చారు. నోటీసులను సాయి డిఫెన్స్ అకాడమీ కార్యాలయం గేటుకు అతికించారు. డిఫెన్స్ అకాడమీకి చెందిన అన్ని రికార్డులు, ఆధార పత్రాలతో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.
మరోవైపు సుబ్బారావును ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే వైద్య పరీక్షల కోసం ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.