Suryaa.co.in

Andhra Pradesh

తెలంగాణలో వర్షాలు… అప్రమత్తంగా ఉండాలి

– సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్

విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏడో రోజు సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

• వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నాం. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి.
• బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని కోరా.
• బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయి. మరి కొద్దిసేపట్లో ఆ పనులు పూర్తి అవుతాయి. దీంతో విజయవాడలోకి నీళ్ళు రావు.. భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్ళు రాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నాం.
• బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోంది…పంపిణీ త్వరగా పూర్తి చేయాలి.
• వరద ప్రభావం వల్ల ఆరో డివిజన్ లో నిత్యావసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరుతున్నారు…వారికి కూడా సరుకుల కిట్ ను అందించాలి.
• ఇళ్ళల్లో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి.
• శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలి.
• తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని సమాచారం
దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలి… ప్రజలను అప్రమత్తం చేయాలి… అవసరమైన సహాయం అందించాలి.
– టెలికాన్ఫరెన్స్ తరువాత విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE