– కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్
గుంటూరు: మోడీ, అమిత్ షా ఇరువురు కలిసి తీసుకొచ్చిన, 130 వ రాజ్యాంగ సవరణ బిల్లును ఖండిస్తున్నాను. ప్రతిపక్షాలను సర్వనాశనం చేసే దానికి 130 వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తెచ్చింది.
భారతదేశానికి మంచిది కాదు. ప్రతిపక్షాలను గౌరవించి, కలుపుకుని వెళ్లాల్సిన అధికార పార్టీ, ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని కుట్రతో ఈ బిల్లును తెచ్చారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు.
జైల్లో పెట్టితే, చట్టసభలకు ప్రాతినిత్యం కోల్పోవాలా?
కమ్యూనిస్టులు ప్రతిరోజూ ప్రజా సమస్యలపై ధర్నాలు చేస్తుంటారు. 30 రోజులు జైల్లో పెట్టితే, చట్టసభలకు ప్రాతినిత్యం కోల్పోవాలా? దేశంలో పది మంది ముఖ్యమంత్రులపై కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు పై కూడా 10 కిపైగా కేసులు ఉన్నాయి. ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఎన్నికల అఫిడవిట్లో వుందన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే… నియంతలు ఆలోచించే ఆలోచనా విధానం కేంద్రం కలిగి ఉంది. అందుకే 130వ రాజ్యాంగ సవరణ చేశారు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టే, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
శ్రీలక్ష్మి…
ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పై వైసీపీ వాళ్లు కించపరుస్తూ, వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు శ్రీలక్ష్మీపై చేసిన విమర్శలను ఖండిస్తున్నాను. శ్రీలక్ష్మి ఐఏఎస్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. 22 ఏళ్లకే ఐఏఎస్ పాసయ్యారు. ఎస్సీ ఐపీఎస్ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. 11 విగ్గులు, 55 లక్షల రూపాయలు. చీర ఒకటిన్నర లక్ష అని ఆరోపించారు. పండగ పూట, ఒక మహిళ చీర కట్టుకుంటే దానిపై కూడా విమర్శలు చేయడం బాధాకరం. రాజశేఖర్ రెడ్డి ఎక్కడ సంతకాలు పెట్టమంటే, అక్కడ సంతకాలు పెట్టి, శ్రీలక్ష్మి జైలుకు పోయారు.
వైయస్సార్ మాటలు విని, సంతకాలు పెట్టి, తన ఐఏఎస్ కెరీర్ ను శ్రీలక్ష్మి పోగొట్టుకుంది. చీఫ్ సెక్రటరీయే కాదు, క్యాబినెట్ సెక్రటరీ హోదాకి వెళ్తుందని అనుకున్నాను. అలా జరగలేదు.
రైతులు – సినిమా ప్రొడ్యూసర్లు
రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాక, కష్టాలు, నష్టాలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం 7000 రూపాయలు ఇచ్చింది. అది ఏ మూలకు సరిపోతుంది? సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారు? రైతులు పండించే పంటలకు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. హంద్రీ- నీవా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. జగన్ మరోసారి ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడోసారి ప్రారంభించబోతున్నారు.
రష్యా చమురు
ఇరాన్, రష్యా నుంచి చమురు భారతదేశానికి దిగుమతి అవుతోంది. ఇరాన్ నుంచి వచ్చే దిగుమతి ధర పెట్రోల్ బంకుల్లో కనిపిస్తోంది. ఇరాన్ కంటే, రష్యా వాళ్లు చమురు 75% తగ్గించి మనకి ఇస్తున్నారు. రష్యా నుంచి లీటర్ 25 రూపాయలకు వస్తోంది. దాన్ని ఎవరెవరికి ఇస్తున్నారు? రష్యా చమురు దిగుమతుల్లో అవినీతి దాగి ఉంది.
బ్యాంకు రుణాలు.
బ్యాంకులు ఇస్తున్న మొత్తం రుణాల్లో 5% మాత్రమే రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, మహిళలకు రుణాలు అందుతోంది. 95% బ్యాంకు రుణాలు కోటీశ్వరులు తీసుకుంటున్నారు. 14.50 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. గుజరాత్ లో ఎంత? ఏపీలో ఎంత? తెలంగాణలో ఎంత? తమిళనాడులో ఎంత? కర్ణాటకలో ఎంత? రుణమాఫీ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి. వంద కోట్ల రూపాయలు పైబడిన ఎన్పీఏ రుణమాఫీలో మతలబు దాగి ఉంది. లక్ష కోట్లు అవినీతి దాగి ఉంది. రష్యా చమురు దిగుమతులు, బ్యాంకు రుణాలు మాఫీ పై కేంద్రం ప్రకటన చేయాలి