– బాధ్యులపై చర్యకు బీజేపీ డిమాండ్
ఖమ్మం: ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తీసిన ర్యాలీ లో ఎర్రటి ఎండలో చిన్న పిల్లలను వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకుని వచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. పాలస్తీనా వ్యవహారం ఏమైనా దేశానికి సంబంధించిన వ్యవహారమా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు ప్రశ్నించారు.
ఈ సందర్బంగా దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ విద్యార్థుల వద్ద నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేసి వారిని రవి మారుత్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి స్కూల్ లు కట్టించిన మానవత్వం గురించి మాట్లాడుతున్నావా? హార్వెస్ట్, సెడార్ వ్యాలీ స్కూల్ లలో ఒక్కో విద్యార్థి నుండి సుమారు రెండు లక్షలు ఫీజు వసూలు చేసే నువ్వా మానవత్వం గురించి మాట్లాడేది? నువ్వు నీ కుటుంబం పూర్తిగా దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారు, మీ స్కూల్ ల పై బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. హిందూ విద్యార్థులకు ముస్లిం వేషధారణ వేశారు, ముస్లిం విద్యార్థులకు హిందూ వేషధారణ వేయగలరా? అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహించే నీ లాంటి వారిని బీజేపీ విడిచి పెట్టదు. దేశ వ్యతిరేక ర్యాలీ లు తప్పించి, దేశానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమం ఒక్కటైన చేసావా? అని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి నున్న రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సన్నే ఉదయ్ ప్రతాప్, గెంటెల విద్యాసాగర్, ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అంజయ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.