హైదరాబాద్: ఇంగ్లాండ్ పార్లమెంట్లోని ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ సభ్యునిగా నామినేట్ అయిన తన ఆప్త మిత్రుడు ఉదయ్ నాగరాజు ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు మర్యాదపూర్వకంగా కలిసి, అభినందనలు తెలిపారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఏర్పాటు చేసిన ‘హై టీ’ కార్యక్రమంలో భాగంగా వారిని కలవడం జరిగింది. ఒక తెలుగు వ్యక్తికి బ్రిటన్ రాజ్యాంగ వ్యవస్థలో ఇంతటి ప్రతిష్టాత్మక బాధ్యత దక్కడం మనందరికీ గర్వకారణం. వారు తమ నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించాలని అని రామచందర్రావు ఆకాంక్షించారు.