– హైదరాబాద్లోని ఉత్తర భారతీయులు బీజేపీకి దన్నుగా నిలవాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైద రాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్తర భారత దేశానికి చెందిన, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ , బీహార్ రాష్ట్రాల ప్రతినిధులతో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. బీహార్లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర భారతీయులు ఆనందంతో పంచుకున్నారు.
బీహార్ , యూపీ ప్రజల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం నిరంతరంగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో ఆనందం వ్యక్తపర్చారు. హైదరాబాద్ తో పాటు మొత్తం తెలంగాణ అభివృద్ధిలో ఉత్తర భారతీయుల సమాజం పోషిస్తున్న కీలక పాత్రను రాంచందర్ రావు గుర్తు చేసుకుంటూ, వారి సహకారాన్ని అభినందించారు. నగర అభివృద్ధి, సామాజిక సమైక్యత, వృత్తి రంగాల్లో వారి విశేష భాగస్వామ్యం చర్చలో ప్రధాన అంశంగా నిలిచింది. సమావేశంలో భవిష్యత్లో ఉత్తర భారతీయులకు మరిన్ని అవకాశాలు, సౌకర్యాలు పెంపొందించే చర్యలపై పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఉత్తర భారతీయులను తెలంగాణ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో మరింత భాగస్వామ్యులుగా చేసే దిశగా ఈ కార్యక్రమం సానుకూల వాతావరణాన్ని సృష్టించింది.