Suryaa.co.in

Andhra Pradesh

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

*  సొంత డెయిరీ ఏర్పాటు చేయండి!
* టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన
* “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన
* రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు
* 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన..

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా భూరి సాయం ప్రకటించడంతో పాటూ ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది.. ఈ సందర్భంగా తిరుమలలో విలేఖరుల నిర్వహించి కీలక ప్రకటన చేశారు.. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన, స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి సొంతంగా తయారీ కోసం సూచనలు చేశారు..!

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమీకరిస్తా..!

కోట్లాది మంది భక్తులు.. వేల కోట్ల ఆస్తులు ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతంగా డెయిరీ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి.. లడ్డు ప్రసాదం సహా, పూజా నెయ్యి కూడా అపవిత్రం అవుతుంది. అందుకే సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని సూచించారు..

  • తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేస్తే.. తన వంతుగా వేయి ఆవులు టీటీడీకి ఇస్తానన్నారు.. అలాగే మరో లక్ష ఆవులు సమీకరించడానికి బాధ్యత తీసుకుని పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
  • లక్ష ఆవులతో తిరుమలలో సొంతగా డెయిరీ ఏర్పాటు చేస్తే రోజుకి రోజుకి కనీసం 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని.., తద్వారా 50 వేల కిలోల వెన్న ఉత్పత్తి ఉంటుందని, దీని ద్వారా రోజుకి సుమారుగా 30 వేల కిలోల నెయ్యి సొంత తయారీ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు..
  • ఈ మేరకు లక్ష గోవులతో గోశాల ఏర్పాటు చేస్తే.. 10 వేల మంది గోపాలులకి ఉపాధి కల్పించవచ్చని.. వీలైతే వారిని యాదవ సామాజికవర్గం నుండి తీసుకుంటే.. గో సేవకులుగా వారు సమర్ధవంతంగా, ఆసక్తిగా పని చేయగలరని సూచించారు..
  • తిరుమల ధార్మిక సంస్థ.. ఇక్కడ వ్యాపారాలు, ఇతర కార్యక్రమాలు సబబు కాదు.. గోవులను పెంచి, డెయిరీ నిర్వహించడం కూడా ధర్మ ప్రచారంలో భాగమే.. దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలి.. దీనిపై కాలయాపన చేయడం మంచిది కాదని ఆయన సూచించారు..

తిరుమల పరిరక్షణ, పవిత్రత ధ్యేయంగా సెప్టెంబర్ 27న పుంగనూరు నుండి మొదలైన పాదయాత్ర నేటితో ముగిసింది.. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న (సోమవారం) జరిగిన మెట్లోత్సవం అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.. ఈ రోజు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకుని, ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A RESPONSE