– తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
– తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మాజీ ఐ .ఏ .యస్
రమణాచారి గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నిర్వహించిన బాల గాంధర్వం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రమణ చారి బర్త్ డే సందర్భంగా చిన్నారి కళాకారుల సమక్షంలో కేక్ కట్ చేసి ,రమణ చారి కి తినిపించిన గుత్తా సుఖేందర్ రెడ్డి.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రమణ చారి బర్త్ డే సందర్భంగా బాల గాంధర్వం కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది రమణ చారి పుట్టినరోజు అంటే కళాకారుల పుట్టిన రోజు అని నేను భావిస్తున్నాను ఆయన ఐ ఏ ఎస్ గా పని చేసి ప్రజలకు ఎన్నో సేవలను అందించారు. రిటైర్డ్ అయిన విశ్రాంతి తీసుకోకుండా ఆయన ప్రభుత్వ సలహదారులుగా ,బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ గా విశేష సేవలను అందిస్తున్నారు. రమణ చారి నిండు నూరేళ్లు చాలా సంతోషంగా జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత చంద్రబోస్ ,రమణ చారి కుటుంబ సభ్యులు, విద్యార్థిని,విద్యార్థులు ,కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.