Suryaa.co.in

Andhra Pradesh

ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి గెలవడానికి నీకు పాతికేళ్లు పట్టింది రాంబాబు

• ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి గెలవడానికి నీకు పాతికేళ్లు పట్టింది రాంబాబు
• చంద్రబాబుని, ఆయన కుటుంబసభ్యుల్ని, టీడీపీ నేతల్ని దూషించడం తప్ప మంత్రులకు, వైసీపీనేతలకు ఇతర సమస్యలు, ప్రజల అవస్థలు పట్టడం లేదు
• బాగా తిట్టేవారికి జగన్ రెడ్డి మార్కులేస్తుంటే, ఆయన దృష్టిలో పడటంకోసం మంత్రులు నోళ్లు పారేసుకుంటున్నారు
• చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం ఇప్పటివరకు ఆయన తప్పు చేశాడని న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించలేకపోయింది?
• టీడీపీ అధినేత తప్పు చేశాడనే ఆధారాలు, సాక్ష్యాలు జగన్ వద్ద లేవు కాబట్టే.. ప్రజలసొమ్ముతో నియమించిన లాయర్లతో కోర్టుల్లో కాలయాపన చేయిస్తున్నాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

‘నిజం గెలవాలి’ కార్యక్రమం… చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి పర్యటనను ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ బెదిరింపులకు నిదర్శనమని, చంద్రబాబుని అరెస్ట్ చేసి 50 రోజులు కావస్తున్నా, కోర్టుల ముందు ఎలాంటి ఆధారాలు ప్రవేశపెట్టలేని ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చేలా అంబటి మాట్లాడాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ టీడీపీ నేతలైనా.. భువనేశ్వరి అయినా జగన్మోహన్ రెడ్డి అవినీతి.. దోపిడీని ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఆధారాలు, సాక్ష్యాలతో ప్రశ్నిస్తూనే ఉంటారు. జగన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు.. ఆర్థిక ఉగ్రవాది అని చెప్పగల ఆధారాలను ప్రజల ముందు ఉంచి గర్వంగా తలెత్తి మాట్లాడతాం. అదే విధంగా చంద్రబాబుపై జగన్ రెడ్డి కక్షతో పెట్టించిన తప్పుడు కేసుకు సంబంధించి తన ప్రభుత్వం వద్ద ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలున్నా యో రాంబాబు సమాధానం చెప్పాలి.

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎఫ్.ఐ.ఆర్ కట్టే రెండేళ్లు దాటిపోతోంది. చంద్రబాబుని అన్యా యంగా జైలుకు పంపి దాదాపు 50 రోజులు అవుతోంది. నేటికీ జగన్ రెడ్డి… ఆయన మంత్రులు.. వాళ్లకు ఊడిగం చేసే అధికారులు చంద్రబాబు తప్పు చేశాడు అని నోటికి పనిచెబుతారు గానీ.. తమవద్ద ఇవిగో ఈ ఆధారాలున్నాయని చూపగలిగారా?

నీటి పారుదల శాఖా మంత్రిగా ఎండిపోతున్న పంటలు.. రైతుల బాధలు రాంబాబుకి పట్టవుగానీ.. నోటిపారుదల మంత్రిగా పేరు పొందడానికి పాకులాడుతున్నాడు
వర్షాలు లేక.. ప్రాజెక్టుల నిర్వహణను జగన్ ప్రభుత్వం పట్టించుకోక, సరైన నీటివసతి లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతుంటే, జలవనరుల మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు కి చీమకుట్టినట్టు కూడా లేదు. నీటిపారుదలపై కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి నోటిపారుద ల శాఖా మంత్రిగా పేరు పొందడానికి నోరు పారేసుకుంటున్నాడు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి గెలవడానికి పాతికేళ్లు పట్టిన రాంబాబు, చివరకు గెలవడం కోసం జిల్లాలు మారాల్సిన దుస్థితి తెచ్చుకున్నాడు.

మచ్చలేని వ్యక్తిని అక్రమంగా, అన్యా యంగా జైల్లో పెట్టినందుకు ప్రజల్లో వ్యక్తమవతున్న ఆగ్రహావేశాలకు జడిసి మతిలేని మంత్రులంతా పోలోమంటూ భువనేశ్వరిపై నోరు పారేసుకుంటున్నారు. మంత్రులుగా ఉండి తమ శాఖల్లో ఏంజరుగుతుందో.. ప్రజలకు ఏం చేయాలో ఆలోచించకుండా ప్రధాన ప్రతిపక్షనేత సతీమణిపై విమర్శలు చేస్తున్నారు. ఎవరు బాగా నోరు పారేసు కుంటే వారికి జగన్ రెడ్డి అన్ని మంచి మార్కులు వేస్తాడనే ఉబలాటంతో మంత్రులు స్థాయిమరిచి మాట్లాడుతున్నారు.

జగన్ సర్కార్ 108 మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చిన సంగతి మరిచావా అంబటి?
జగన్ సర్కార్ 108 మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చిన విషయం.. మద్యం అమ్మకా ల ద్వారా రూ.2లక్షలకోట్లు మందుబాబుల నుంచి రాబడితే, అందులో రూ.లక్షకోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరింది నిజం కాదా అంబటి? జగన్ రెడ్డి తన డబ్పుపిచ్చితో నాసిరకం మద్యం అమ్మిస్తూ, పేదల బతుకుల్ని ఛిద్రం చేస్తుంటే, సిగ్గులేకుండా మద్యం అమ్మకాలను అంబటి రాంబాబు సమర్థించుకుంటున్నాడు.

జగన్ రెడ్డి కల్తీ మద్యానికి బానిసలై దాదాపు 35లక్షల మంది పేదలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యారు. వైసీపీనేతలే కల్తీ మద్యం తయారు చేయిస్తూ…అధికారపార్టీ వారు, వాలంటీర్లతో అమ్మిస్తున్నది నిజం కాదా అంబటి?

జగన్ జైలుకెళ్లినప్పుడు తల్లి.. చెల్లీ తప్ప ఎవరూ స్పందించలేదు చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ అనుసరించిన మార్గమే భవిష్యత్ లో అతనికి, అతని ప్రభుత్వానికి సమాధి కడుతుంది
కేవలం చంద్రబాబునాయుడికి అవినీతి మకిల అంటించాలన్న జగన్ రెడ్డి దురుద్దేశం.. కుట్ర రాజకీయం తప్ప టీడీపీ అధినేత ఎలాంటి తప్పు చేయలేదని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు తన బంధువులే తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. జగన్ తల్లి, చెల్లి తప్ప ఎవరూ బయటకు వచ్చిందిలేదు. చంద్రబాబు అరెస్ట్ పై ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు నీకు.. నీ ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అంబటి?

చంద్రబాబుకు మద్ధతుగా ప్రజలు బయటకువస్తున్నారన్న దుగ్ధతో పోలీసుల్ని అడ్డుపెట్టి, తప్పుడు సెక్షన్లతో వారిని అడ్డగిస్తూ, జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనే జ్ చేస్తుంటే కనిపించడం లేదా అంబటి? చంద్రబాబుకు సంబంధించిన కేసుల్లో సరైన ఆధారాలు లేక, న్యాయమూర్తులకు ఏం చెప్పాలో తెలియక ప్రజలసొమ్ముతో నియమిం చిన లాయర్లతో కాలయాపన చేయిస్తున్నది జగన్ రెడ్డి కాదా రాంబాబు?

నీతివంతు డు.. నిజాయితీపరుడైన చంద్రబాబుని దోషిగా నిరూపించడం జగన్ రెడ్డి తరంకాదు. అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపిన జగన్ కు, మంత్రులకు ఏ గతి పడుతుం దో కాలమే సమాధానం చెబుతుంది. చంద్రబాబుని జైలుకు పంపడానికి జగన్ అనుస రించిన మార్గమే, భవిష్యత్ లో అతనికి.. అతని ప్రభుత్వానికి సమాధి కడుతుంది.” అని ఆనంద్ బాబు హెచ్చరించారు.

LEAVE A RESPONSE