– పరకామణి కేసులో దొంగతో ఆస్తులు రాయించడానికి వైసీపీ నేతలు ఎవరు?
– వైద్య కళాశాలల ఏర్పాటులో పీపీపీ అంటే ప్రో పూర్ పీపుల్ అని అర్ధం
– రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: గత ప్రభుత్వం చేసిన పాపాలను పూర్తిగా కడగడానికి ఇప్పటికీ సమయం పడుతోంది. రిజిస్ట్రేషన్ శాఖలో పూర్తి స్థాయి మార్పులతో తప్పులకు ఆస్కారం లేని వ్యవస్థ తీసుకువస్తాం. ఇతర రాష్ట్రాలను, విదేశాల్లోని విధానాలను అధ్యయనం చేసి మార్పులు తెస్తాం. ప్రభుత్వం నుండి, కోర్టుల నుండి వేలంలో కొన్న భూములకు 22ఎ నుండి తొలగించాలని నిర్ణయం.
ఇండిగో ఎయిర్ లైన్స్ వివాదంలో మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇండిగో కారణంగా సమస్య తలెత్తింది. మంత్రి రామ్మోహన్ నాయుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. ఇండిగో అహంకారం కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. పరకామణి కేసులో దొంగతో ఆస్తులు రాయించడానికి వైసీపీ నేతలు ఎవరు? వైద్య కళాశాలల ఏర్పాటులో పీపీపీ అంటే ప్రో పూర్ పీపుల్ అని అర్ధం. పేదలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందుతాయి.