Suryaa.co.in

Andhra Pradesh

దళిత మంత్రి సురేష్ నియోజకవర్గంలో దళితులపై అత్యాచారాలు,హత్యలు

– దళితులకు రక్షణ కల్పించండి మంత్రి గారు…
– దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న అగ్రవర్ణ దాడులు అత్యాచారాలు హత్యలు.
– ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టి యస్సి సెల్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం:నియోజకవర్గంలో దళితుల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని ఎస్సి ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కేసును నీరు కార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టి యస్సి సెల్ అధ్యక్షులు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.బుధవారం నాడు స్ధానిక కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో దళితులపై నిత్యం జరుగుతున్న అగ్రవర్ణ దాడులు అత్యాచారాలు హత్యలు రోజు రోజుకు అధికమౌతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నాడని ప్రశ్నించారు.

అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తు దళితుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడంలో మంత్రి విఫలమయ్యాడని విమర్శించారు.త్రిపురంతకం మండలం మిరియంపల్లి గ్రామంలో సోమవారం మద్యాహ్నం సమయంలో యస్సి మాల కులానికి చెందిన బొందలపాటి చెన్నమ్మ అనేవారు కౌలుకు తీసుకొని పండిస్తున్న పంట పొలంలో అదే గ్రామానికి చెందిన బొల్లెపల్లి విష్ణు ఓసి కమ్మ కులానికి చెందిన వ్యక్తి గేదెలను బొందలపాటి చెన్నమ్మ పండిస్తున పంట పొలంలోనికి గేదెలు తోలి మేపుతుండటం చూసిన బొందలపాటి చెన్నమ్మ ,బొల్లెపల్లి విష్ణు ను మా పొలంలో ఎందుకు మేపుతున్నావ్ ఏంటి అని ప్రశ్నించినందుకు నన్నే ప్రశ్నిస్తావా కులం తక్కువదానా అంటూ ఒంటరిగా ఉన్న మహిళపై అతి తీవ్రంగా కులం పేరుతో దూసిస్తూ విచక్షణా రహితంగా కొడవళితో దాడి చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని వారి భందువుల ద్వారా అడిగి తెలుసుకోగా ఆమెను వైద్యం నిమిత్తం నరసరావుపేట హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉందని 5 చోట్ల కొడవలితో దాడి చేశాడని దాడిలో అన్ని చోట్ల మొత్తం 20 నుంచి 30 కుట్లు వైద్యులు వేశారని బాధితురాలు భర్త అయిన బొందలపాటి ప్రేమనందం తెలిపారని అన్నారు.ఈ మూడేళ్ళలో నియోజకవర్గంలో దళితులపై అనేకమైన దాడులు హత్యలు జరిగినా ఏ ఒక్కరికి న్యాయం చేకూర్చలేదని దళిత మంత్రి అయ్యి ఉండి దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించకపోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

కావున బాధితురాలు అయిన బొందలపాటి చెన్నమ్మకు న్యాయం చేయకుంటే ఆమెకు న్యాయం జరిగే వరకు అమె పక్షాన పోరాటం చేస్తామని తెలియజేశారు.ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని కావున దాడి చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు పుణరావృతం కాంకుండా దళితులకు బధ్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE