– నాలుగు నెలలుగా ఇద్దరు బలాత్కారం
తిరుపతి : మానవ మృగాల కీచకపర్వానికి అంతులేకుండా పోతుంది.. నాలుగు నెలలుగా ఓ బాలికపై ఇద్దరు వృద్ధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా డక్కిలి మండలం నాగవోలు పంచాయతీ మహాసముద్రం గ్రామంలో చోటుచేసుకుంది. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. మహాసముద్రం గ్రామానికి చెందిన బాలిక (14)పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు నాలుగు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మూడు నెలల గర్భవతి అని నిర్ధారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు (65-70 ఏళ్ల వయస్సు) వృద్ధులు తనపై అత్యాచారానికి పాల్పడారని తెలిపింది. డక్కిలి పోలీసు స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.