– జర్నలిస్టు సాయి, జర్నలిస్టు వైఎన్నార్కు ఓపెన్ ఆఫర్
ఎర్నలిస్టులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన నిఖార్సైన రెడ్డి! పేటీఎంల కోసం ప్రకటించలేదని నిరుత్సాహపడకండి!
రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి, వందకో.. నూటయాభైకో తమ కలం, గళం అమ్మేసుకుంటున్న ‘జగన్ భజన బృందం’ అయిన ఎర్నలిస్టులకు ఈ ఆఫర్ ప్రకటించారు. జర్నలిజం ముసుగులో వారు చేస్తున్న నాటకాలు చూసి జాలిపడి ఆర్సీ రెడ్డి గారు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
“మేము అడుక్కు తింటాం.. కానీ మిమ్మల్ని మాత్రం ఆదుకుంటాం. రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద దరిద్రం మీరే అని మాకు అర్థమైంది. అందుకే మీ ఆకలి తీర్చడానికి మేమే పూనుకుంటున్నాము. మీరు ఆ 150 రూపాయల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టొద్దు. మీకు నిజంగా ఎంత కావాలో ఓపెన్ గా చెప్పండి. మేము కూలీనాలీ చేస్తాం, కావాలంటే భిక్షాటన చేస్తాం.. మూడు నెలల పాటు కష్టపడి మీరు అడిగినంత మొత్తాన్ని మీ పాదాల దగ్గర పెడతాం!” అని సవాల్ విసిరారు.
సాధారణంగా ఏదైనా దోషం ఉంటే శని గ్రహ శాంతి పూజలు, రాహు-కేతు పూజలు చేయిస్తారు. కానీ ఈ రాష్ట్రానికి పట్టిన ఈ ‘శనిగ్రహాల’ శాంతి కోసం డబ్బులే సరైన పరిష్కారం అని మేము నమ్ముతున్నాము. మీ ఆకలి తీరితే గానీ ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం వదలదు.
“రాష్ట్రం బాగుపడాలంటే మీరు బాగుపడాలి.. మీరు బాగుపడాలంటే మీకు డబ్బులు కావాలి. కాబట్టి, రాష్ట్రం కోసం మేము అడుక్కునైనా సరే మీకు డబ్బులు ముట్టజెప్పుతాము!”
మీ పబ్బం గడుపుకోవడానికి అమాయక ప్రజల భవిష్యత్తును నాశనం చేయకండి. మీకు కావాల్సిన ‘ప్యాకేజీ’ని బహిరంగంగా ప్రకటించండి. మేము జోలె పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మీకు ఆ భిక్ష పెడతాం. దయచేసి రాష్ట్రం మీద విషం చిమ్మడం మానేసి, ఈ ‘దానాన్ని’ స్వీకరించి శాంతించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
ఈ ఆఫర్ను ‘ఎర్ర భావజాల’ ముసుగులో ఉన్న తెలంగాణ ప్రొఫెసర్ నుండి ముసలి రవి వరకు అందరూ వినియోగించుకుంటే మంచిది. ఇక పేటీఎంలది కేవలం 5 రూపాయల పేమెంట్లే కాబట్టి, వారు గుడి మెట్ల దగ్గర కూర్చుంటే.. ‘మాజీ పేటీఎంలు’గా జాలిపడి జనం మరింత పెద్ద ఎత్తున ముష్టి వేస్తారు.
ఐదు కోట్ల ప్రజల పాలిట అబద్ధాల, మోసాల, కుట్రల పావులుగా మారి పాపాలను మూటగట్టుకోకండి. ఈ భూమి మీదే ఆ కర్మను అనుభవించాల్సి ఉంటుంది. దయచేసి మారండి, సాటి మనుషులుగా బతకండి.
– చాకిరేవు