– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్
ఘర్షణలు జరిగి అక్రమాలకు పాల్పడిన పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు.వైసీపీ పోలీసులు సహకారం తో అక్రమాలకు పాల్పడిందని ఈ సంఘటన లిప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.
తిరుపతి లో 253,259,232 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఛాలెంజ్ ఓటు ను అధికారులు అనుమతించలేదు. అందువల్ల వెబ్ వీడియో ద్వారా దర్యాప్తు చేసి రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే వేణుగోపాల్ – చిత్రీకరిస్తున్న జర్నలిస్టు సెల్ ఫోన్ లాక్కున్న ఎస్ఐ సంపత్ కుమార్ జర్నలిస్టు పట్ల దురుసు గా వ్యవహరించారని ఆరోపించారు.
ఒంగోలు ఎకెవిడి పాఠశాల లో 69 పోలింగ్ బూత్ లో బిజెపి ఏజెంట్ జి.సత్యనారాయణ ను పోలీసులు పోలింగ్ బూత్ లో కి రానివ్వకుండా అడ్డుకున్నారు.యథేచ్ఛగా వైసీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపించారు ఈసంఘటన లో బాధ్యులను అరెస్టు చేయాలి.దొంగ ఓటర్ లను వైసీపీ పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు తరలించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.