– రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
– తెలంగాణ కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
– చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకుల స్పష్టీకరణ
– తిరుపతిలో నిర్వహించిన ’రాయలసీమ ఎత్తిపోతల పథకం–చంద్రబాబు మోసం’ సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సాకే శైలజానాథ్, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదన్ రెడ్డి, నారాయణస్వామి
తిరుపతి: రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాక, అది కూడా సరిపోదని, 85 వేల క్యూసెక్కులకు పెంచాలన్న చారిత్రక నిర్ణయం జగన్ తీసుకున్నారు. ఈ హెడ్ రెగ్యులేటర్‌కు నీటి సరఫరా కోసం రూ.4 వేల కోట్లతో రాయలసీమ లిఫ్ట్‌కు శ్రీకారం చుట్టారు. దీని కోసం దాదాపు రూ.800 కోట్లు ఖర్చు కూడా చేశారు. వైయస్సార్ తెచ్చిన జలయజ్ఞాన్ని ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబు సమూలంగా నాశనం చేశారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో నదుల సంధానం తన జీవితాశయం అంటున్నారు. చంద్రబాబుకు ఇలాంటి జీవితాశయాలు రెండు కోట్లు ఉంటాయి. కనబడిన ప్రతీదీ జీవితాశయం అని చెప్పుకుంటూ ఏదీ నెరవేర్చకపోవడమే ఆయన నైజం. తెలంగాణ ముఖ్యమంత్రితో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపిన వ్యక్తి కూడా చంద్రబాబే. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 300పైగా చెరువుల పూడికలు తీయడం లేదు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే గాలేరు–నగరి కింద 1.07 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. చంద్రబాబు సొంత జిల్లాలో సాగునీటి పథకాలు కూడా పట్టించుకోకపోవడం వల్లే వైఎస్సార్సీపీ పోరాటాలు చేస్తోంది.రాయలసీమ లిఫ్ట్ కోసం ఈ ప్రభుత్వం మీద జగనన్న సైనికులుగా పోరాడేందుకు అందరూ సిద్దంగా ఉండాలి. ఇందుకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం.
రాయలసీమ లిఫ్ట్ పూర్తి కాకపోతే సీమ ఎడారే
– మాజీ మంత్రి సాకే శైలజానాథ్
రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రాంతానికి పెద్ద కష్టం రాబోతోంది. రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేŠశ్ మొత్తానికి నీటి కష్టాలు రాబోతున్నాయి. కృష్ణానది నీళ్లు రాకపోతే రాయలసీమ జిల్లాలకు తాగునీరు కూడా దొరకని పరిస్ధితి. కృష్ణా నది మీద ఆధారపడిన ప్రాజెక్టులన్నీ ఎండిపోయే కాలం దగ్గర్లోనే ఉంది. దీనికి కారణం చంద్రబాబు పాలన. ఆయనతో పాటు కర్నాటక నీటి యాజమాన్యం కూడా రాయలసీమకు కష్టాలు తెచ్చిపెట్టబోతోంది.
చంద్రబాబుకు నీళ్లన్నా, రైతన్నా, పంట అన్నా ఇష్టం ఉండదు కాబట్టి ఆపేసినట్లుంది. తాను రహస్యంగా కలిసి మాట్లాడితే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఆపేశాడని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. గతంలో 10 వేల క్యూసెక్యులతో ఉన్న పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామరŠాధ్యన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచారు. కానీ ఇప్పుడు ఆ 40 వేల క్యూసెక్కులు కూడా రాని పరిస్ధితి నెలకొంది. 840 టీఎంసీల కంటే తక్కువ నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉంటే పోతిరెడ్డి పాడు నుంచి చుక్క నీరు కూడా కిందకు రాదు.
అదే జరిగితే పోతిరెడ్డిపాడు, తెలుగుగంగ, సోమశిల వంటి ప్రాజెక్టులు నీళ్లు లేక అలమటిస్తాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఆపేయడం దారుణం. గతంలో బాబు హయాంలో రిజర్వాయర్ గా ఉన్న ఆల్మట్టి డ్యామ్ గా మారిపోయింది. దాన్ని ఇంకా పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
రాయలసీమ లిఫ్ట్ కోసం పాదయాత్రకు సిద్ధం.
– మాజీ మంత్రి ఆర్కే రోజా
రాయలసీమకు ద్రోహం చేస్తే, ఇక్కడి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూపించేందుకే మేం ఇక్కడ సమావేశమయ్యాం. రాష్ట్రంలో రైతుల కోసం, రాయలసీమ పొలాల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కేలా చేశారు.
ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ముందుకెళ్తుంది. విజన్ ఉందీ విస్తరాకుల కట్ట ఉందని చెప్పుకునే చంద్రబాబు.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాం. రాయలసీమ లిఫ్ట్‌కు రూ.2 వేల కోట్లు ఇస్తే పూర్తవుతుంది.
రాయలసీమ లిఫ్ట్ కోసం త్వరలో కార్యాచరణ
– మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
రాయలసీమ లిఫ్ట్ ను తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టాలని వైఎస్సార్సీపీ నేతలు కోరుకుంటున్నారు. ఇందుకోసం ఓ కమిటీగా ఏర్పడి కార్యాచరణ తీసుకుందాం. రోజా చెప్పినట్లు రాయలసీమ లిప్ట్ కోసం పాదయాత్ర చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. పోతిరెడ్డిపాడు నుంచి తిరుపతి లేదా తిరుపతి నుంచి పోతిరెడ్డిపాడుకు పాదయాత్ర చేపట్టాలా అన్నది జగన్ వారి వద్ద కూర్చుని మాట్లాడుకుని ఖరారు చేస్తాం. రాయలసీమ లిఫ్ట్ కు మొన్న పార్లమెంట్లో మాట్లాడిన రేణుకా చౌదరి పేరు పెట్టయినా చంద్రబాబు పూర్తి చేయాలి.