– రేవంత్ రెడ్డి బావమరిదికి ₹ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు
– బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు ₹ 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు
– 10 వేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు
– 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్
– సీఎం రమేష్ సవాల్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిసవాల్
హైదరాబాద్: హైదరాబాద్‌లో కాంట్రాక్టులను ఎలా చెరబట్టారన్న అంశంపై తనతో చర్చించేందుకు బీజేపీ ఎంపి సీఎం రమేష్, సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ తెరవెనక బాగోతాన్ని బయటపెడతానన్న సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రతిస్పందించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
సీఎం రమేష్ – సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే.. హెచ్‌సీయూ ₹ 10000 కోట్ల స్కాం పైనా.. 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కాంపై.. రెండిటిపైనా కలిసి చర్చ కు సిద్ధం. దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి ₹ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు ₹ 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు. ఇంతకన్నా దిగజారుడు రాజకీయం.. దౌర్భాగ్యపు దందా ఇంకోటి ఉంటదా?
సీఎం రేవంత్.. .సీఎం రమేశ్ ఇద్దరి బాగోతం నేను బయటపెట్టడంతో, కుడిదిలో పడిన ఎలుకలా ఇద్దరూ కొట్టుకుంటున్నారు. లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట. హెచ్‌సీయూ భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న.. లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు. నేను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైంది. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కు పనికి రాని కథలు చెబుతుండ్రు.
రూల్స్ ను బ్రేక్ చేయడం.. కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్టబెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. నీ దోస్తు 10 వేల కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు నీకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్.. 1660 కోట్ల కాంట్రాక్ట్ అని తేలిపోయింది. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు, బీజేపీలో విలీనం అనే పనికిరాని, పస లేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నరు.
తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పుడే కాదు. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. తాము ఇరకాటంలో పడిన ప్రతిసారి, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఈ పనికి రాని చెత్త అంశాన్ని తెరపైకి తెచ్చి, తెలంగాణ ప్రజలను కన్ ఫ్యూచ్ చేయాలని చూస్తున్నారు.