-మీలో తెలంగాణ రక్తముంటే బహిరంగ చర్చకు రావాలి
-ప్రజల కోసం పొర్లు యాత్రకూ సిద్ధమే…
-కేసీఆర్ రాక్షస పాలన అంతానికే ప్రజా సంగ్రామ యాత్ర
-14న అమిత్ షా సభకు భారీగా తరలిరండి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కేంద్ర నిధులు, క్రిష్ణా జలాల వాటాలో జరిగిన అన్యాయం, పాలమూరు వెనుకబాటుతనంపై ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ ను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీతో కుమ్కక్కై తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా… 299 టీఎంసీల వాటాకే అంగీకరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ఆధారాలతోసహా నిరూపించేందుకు సిద్ధమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఇంకా ఎడారినే తలపిస్తోందనే మాటకు కట్టుబడి ఉన్నానని… తనతోపాటు వస్తే పాలమూరు ప్రజల సమక్షంలోనే ఈ విషయాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి పనుల్లో కేంద్ర నిధుల్లేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆధారాలతోసహా తప్పని నిరూపిస్తామన్నారు.
ఈ సందర్భంగా ఈ మూడు అంశాలపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘‘కేసీఆర్…. మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే.. మీరు తెలంగాణ వాదులే అయితే… మీకు సిగ్గు, శరం, నిజాయితీ ఉంటే బహిరంగ చర్చకు రండి. నేనింకా రంగారెడ్డి జిల్లాలో 4 రోజులు పాదయాత్ర చేస్తా.. ప్రజల సమక్షంలోనే తేల్చుకుందాం…రండి’’అని ఘాటైన పదజాలంతో సవాల్ విసిరారు… ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 27వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు.
డప్పులు, వాయిద్యాలు, గిరిజన న్రుత్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. కొందరు అభిమానులు గజమాలతో బండి సంజయ్ ను సత్కరించారు. వారితో కలిసి తొమ్మిది రేకుల గ్రామం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బండి సంజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వివిధ పార్టీలకు చేందిన పలువురు నేతలు, కార్యకర్తలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం తొమ్మిది రేకుల గ్రామ ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
అందులోని ముఖ్యాంశాలు…..
బీజేపీకి ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులను గెలిపించిన జిల్లా రంగారెడ్డి జిల్లా.
బీజేపీ చేపడుతున్న ప్రజా సంగ్రామ యత్రతో టీఆరెస్ బాక్స్ లు బద్ధలవుతున్నాయి.
కేసీఆర్ సార్ ఇంకా లేచి వుండడు… రాత్రి అంతా తాగుడు, తెల్లారిందాక పండుడే. కేసీఆర్ తాగి పండుతుంటే కొడుకు కేటీఆర్ మొరుగుతుండు.
ఆయ్యా కొడుకుల బతుకు బరబాత్ చేస్తా. కేసీఆర్ మోసం, బండారం బయటపెడతా. పాలమూరు పచ్చగున్నదా? రా ఇక్కడే ఇంకా నాలుగు రోజులుంటా… పాలమూరు ఎడారిగా మారిందని నేను నిరూపిస్తా… దమ్ముంటే రండి..
టీఆర్ఎస్ పనైపోయింది…. అందుకే కేటీఆర్ సభకి కుర్చీలే దర్శనమిస్తున్నాయి.
చంద్రబాబు కు అమ్ముడుపోయి క్రిష్ణా జలాల్లో తెలంగాణ కు రావాల్సిన 575 టీఎంసీ ల వాటాకు గాను, 299టీఎంసీ లకే సంతకం పెట్టి, కృష్ణా జలాల్లో అన్యాయం చేసిన మూర్ఖుడు కేసీఆర్
అమెరికాలో చెప్రాసి పని చేసుకుని, ఉద్యమం లో పాల్గొనకున్నా మంత్రి అయ్యిన కేటీఆర్ అబద్దాలు చెబుతూ కుక్కలా మొరుగుతుండు..
299TMC లకు ఒప్పుకుని 575TMC ల వాటాకు గండి కొట్టి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు తీరని నష్టం చేసిన ద్రోహి కేసీఆర్. ఆధారాలతో సహా ఒప్పించేందుకు నేను సిద్ధం అని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా.
పాదయాత్ర లో ప్రజలు మద్దతు ఇస్తుంటే… trs నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది, కళ్ళు కనిపించడం లేదు. తెలంగాణ దీక్ష చేయకుండా గద్దెనెక్కిండు కేసీఆర్.
పేదలకు ఫ్రీగా 5 కిలోల బియ్యాన్ని మోడీ ఇస్తుంటే… కేసీఆర్ అమ్ముకుంటున్నాడు. పేదలకిస్తున్న బియ్యాన్ని అమ్ముకుంటూ పేదల రక్తాన్ని తాగుతున్న నీచమైన బతుకు కేసీఆర్ ది… థూ…ఇట్లాంటి బతుకు ఎందుకు బతుకుతున్నడో అర్ధం కావడం లేదు?
తెలంగాణకు లక్షా 40వేల ఇండ్లను మోడీ మంజూరు చేస్తే… తొమ్మిద రేకుల గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చాడు? పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా… వారి ఉసురు పోసుకుంటున్నాడు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తాను మాత్రం తన ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. నెలకు రూ. 25 లక్షల జీతం తీసుకుంటున్నారు
పాలమూరు ప్రాజెక్టులను కుర్చీ వేసి కూర్చుని పూర్తి చేస్తానన్న కెసిఆర్ హామీ ఏమైంది? నమ్మించి మోసం చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
ప్రజల పడుతున్న బాధలను తెలుసుకునేందుకు నేను పాదయాత్ర చేస్తుంటే మోకాళ్ల యాత్ర చేయాలంటూ టీఆర్ఎసోళ్లు అంటున్నరు… ఎస్… ప్రజల కోసం పొర్లుకుంటూ తిరగడానికైనా భారతీయ జనతా పార్టీ సిద్ధం.
కెసిఆర్ రాచరిక, అరాచక, కుటుంబ పాలనను అంతమొందించడానికే…. ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే. కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా… స్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నావా అని కేసీఆర్ కు సవాల్ విసురుతున్నా. కేంద్ర నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివ్రుద్ధి చెందుతోందని నిరూపించేందుకు నేను సిద్ధం… దమ్ముంటే చర్చకు రావాలి… మీకు చేతగాకపోతే మీ చెంచాగాళ్లను పంపినా సరే… మా ఎమ్మెల్యేలు ఆధారాలతో సహా బహిరంగ చర్చకు సిద్ధం.
1400 మంది అమరులయితేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణ రావడానికి? మందులో సోడా పోసే సంతోష్ రావు… తెలంగాణ ఉద్యమం లో ఏం త్యాగం చేశాడు? పేదలను అభివృద్ధి చేయడానికి…. ప్రజలకు న్యాయం చేయడానికి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి
పాలమూరు జిల్లాలో పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. రంగారెడ్డి జిల్లాలో ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా
మే 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ లో జరిగే “ప్రజా సంగ్రామ యాత్ర-2” ముగింపు సభ… తెలంగాణలో ఒక సంచలనం సృష్టించబోతోంది
‘అమిత్ షా’ పాల్గొనే ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నాం
5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది, ఈ సభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కోరుతున్నా.