– మంత్రి పదవి ఇస్తా అంటేనే కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యా.
– జూనియర్ లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారు
– నాకు పదవులు కాదు, ప్రజలు ముఖ్యం
– మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
హైదరాబాద్: ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ.బీఆర్ఎస్ హయంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తెచ్చా. ప్రజల కోసం మళ్ళీ రాజీనామాకు రెడీ
నాకు పదవులు కాదు, ప్రజలు ముఖ్యం. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి. మంత్రి పదవి ఇస్తా అంటేనే కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యా.. జూనియర్ లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేది వాళ్ళ విజ్ఞత. మునుగోడు అభివృద్ధి మాత్రం నా బాధ్యత. పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం నాది కాదు.
వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి, నాకెందుకు పదవులు?మంత్రి పదవి కావాలా ? మునుగోడు ప్రజలు కావాలా ? అంటే మునుగోడు ప్రజలే కావాలని చెబుతా.