– 4300స్లాట్ ల డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి?
– ట్రెజరీ ఖాతాలోకి పోవాల్సిన సొమ్ము ఎవరి ఖాతాలోకి పోతున్నాయి?
– అది ఫ్యూచర్ సిటీ కాదు రియల్ ఎస్టేట్ సిటీ
– భూ భారతి లో అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలి
– బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మాఫియా నడుస్తోంది. భూ భారతి తో పారదర్శకత తీసుకు వస్తాం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం అవుతుంది. ధరణి పై అనేక ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇవాళ భూ భారతి ద్వారా అక్రమాలకు అడ్డా అయింది.
52 లక్షల స్లాట్ బుక్ చేస్తే 4300స్లాట్ ల డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి. ప్రభుత్వ సొమ్ము ఎటు పోతుంది? ఆ సొమ్ము ఇప్పుడు ఎవరి ఖాతాలకి పోయినవి చెప్పాలి. యాదాద్రి,రంగారెడ్డి జిల్లా,జనగామ జిల్లా లో జరిగిన అక్రమ లావాదేవీలు ఎవరి ఖాతాలకు పోయినవి.ట్రెజరీ ఖాతాలోకి పోవాల్సిన సొమ్ము ఎవరి ఖాతాలోకి పోతున్నాయి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పాలి.
రంగారెడ్డి జిల్లాలో లక్షల ఎకరాలు భూమిని నిషేధిత జాబితాలో చేర్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవాళ రైతులు రుణమాఫీ కాలేదని కోర్టు కు వెళ్ళారు. స్వయంగా కోర్టు యాదాద్రి జిల్లా కలెక్టర్ కు , వ్యవసాయ శాఖ అధికారుల కు నోటీస్ లు ఇచ్చారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గతంలో ధరణిపై అనేక ఇబ్బందులు పెట్టీ భూ భారతి తెచ్చారు
ఇప్పుడు మళ్ళీ భూ భారతి ఎందుకు తప్పుదోవ పట్టింది? ఫ్యూచర్ సిటీ లో అసైన్డ్ ల్యాండ్ లు గుంజుకుంటుంది. ఆ భూములను ప్రభుత్వ పెద్దలు లాక్కుంటున్నారు. అది ఫ్యూచర్ సిటీ కాదు రియల్ ఎస్టేట్ సిటీ. భూ భారతి లో అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని మా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం