– ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు
విజయవాడ: శ్రీకృష్ణదేవరాయలు 516వ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా పోరు మామిళ్ల ఈశ్వర్ రాయలసేన వారి ఆహ్వానం మేరకు కృష్ణా నది తీరాన, విజయవాడ బస్టాండ్ పక్కన వేంచేసి ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వర రావు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయలవారి పరిపాలన గురించి, వారి ఔన్నత్యాన్ని గురించి వివరించారు. అలాగే జగ్గయ్యపేట మాజీ శాసన సభ్యుడు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాయలవారి జీవితం నేటి యువత అదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్పొరేటర్ టిడిపి ప్లోర్ లీడర్ నెలిబండ్ల బాల మాట్లడుతూ రాయలవారు తెలుగు భాషను తెలుగు వారి ధైర్యసాహసాలు ప్రపంచానికి చాటి చేప్పిన దక్షిణ భారత చక్రవర్తి అని తెలియచేస్తూ ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాయలసేన టిమ్ వారిని అభినందించారు.
కాపు జెఎసి అధ్యక్షుడు చందు జనార్దన్, సీనియర్ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, విజయవాడ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ తిరుపతి సురేష్ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నాయకులు తిరుపతి అనూష, సెంట్రల్ నియోజకవర్గం భూపతి మహేశ్ కుమార్, పండలనేని శివ గోపాల్, బాశేట్టి ప్రసాద్, కూనపరెడ్డి రమేష్, మీసాల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.