– మొదటి దశ పునర్మిణాన పనులకు భూమి పూజ
– టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
తిరుపతి: తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్మిణాన పనులకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్మిణాం పనులను వేగవంతం చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
మొదటి దశగా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి గర్భాలయం, అర్ధమండపం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహా మండపం పనులను పునర్మించేందుకు చర్యలు చేపట్టినట్టు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే రూ. 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ నిధులతో పాటు ఆ పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామన్నారు.
వీటితోపాటు ముఖ మండపం, నంది మండపం, రాజ గోపురం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోటు, కల్యాణ కట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు.
అంతకుముందు భూమి పూజ
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతా రామ్, టీటీడీ సీఈ టీవీ సత్యనారాయణ, టీటీడీ ఎస్ ఈ మనోహర్, ఈఈ జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు.