– గ్లోబల్ సమ్మిట్ లో 3,24,698 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు..1,40,500 మంది యువతకు ఉపాధి
– రెండు రోజుల్లో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒప్పందాలు
హైదరాబాద్: పెట్టుబడులకు స్వర్గ ధామం తెలంగాణ అని డిప్యూటీ సీఎం, విద్యుత్తు, ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గత కొద్దిరోజులుగా తన శాఖ సిబ్బందితో గ్లోబల్ సమ్మిట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.
ఆ మేరకు తన శాఖ పరిధిలోని ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒప్పందాలకు సంబంధించిన ప్రగతిని తాను స్వయంగా పర్యవేక్షించారు. ఫలితంగా గ్లోబల్ సమ్మిట్ లో రెండు రోజుల వ్యవధిలో 3.24 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలోని 1,40,500 మంది తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ జెన్కో, రెడ్కో మరియు సింగరేణి సంస్థలు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.