Suryaa.co.in

Andhra Pradesh

జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్నాయత్నం కింద అక్రమ కేసు నమోదు దుర్మార్గం

-గొట్టిపాళ్ల సంఘటన సమయంలో తిరుపతిలో ఉంటే కేసు ఎలా పెడతారు?
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గొట్టిపాళ్లలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి ఘటనకు సంబంధించి పార్టీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కింద అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గొట్టిపాళ్ల సంఘటన సమయంలో జూలకంటి బ్రహ్మారెడ్డి తిరుపతిలో ఉంటే ఆయనపై కేసు ఎలా నమోదు చేస్తారు?

రాష్ట్రంలో విధ్వంస, అరాచక పాలనకు అక్రమ కేసు నమోదే నిదర్శనం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే పోలీసులు ఈ అక్రమ కేసు నమోదు చేశారు. సెక్షన్ 307 కింద నమోదు చేసిన ఈ కేసులో బ్రహ్మారెడ్డి పేరు చేర్చడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపులో భాగమే. వైసీపీ నాయకులపై నామమాత్రపు కేసులు పెట్టి బాధితులైన టీడీపీ నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడం దుర్మార్గం.

రాష్ట్రంలో టీడీపీ నేతల పట్ల కక్షసాధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. పోలీసులు చట్టప్రకారం నడుచుకోవాలి. బ్రహ్మారెడ్డి, ఇతర టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేసిన హత్యాయత్నం కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజాపోరాటం తప్పదు.

LEAVE A RESPONSE