ఆయన కులాలను రెచ్చగొడుతున్నారు సునీల్ వ్యాఖ్యలు సర్వీసు రూల్స్ కు విరుద్ధం డీ ఓ పీ టి కి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు లేఖ
అమరావతి: రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతూ తన ప్రసంగాలతో రెచ్చగొడుతున్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సర్వీస్ నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన డిఓపిటికి లేఖ రాశారు. దళితులు కాపులు కలిస్తే రాజ్యాధికారం మనదేనని.. ఆ మేరకు దళితుల్లో చైతన్యం పెరగాలని.. కాపులు సీఎం పదవి, దళితులు డిప్యూటీ సీఎం పదవి తీసుకొనేలా దళితుల్లో రాజకీయ చైతన్యం పెరగాలంటూ, ఇటీవల సునీల్ చేసిన ఒక ప్రసంగపు వీడియో ను రఘురాం కృష్ణంరాజు తన లేఖకు జతపరిచారు.
ప్రభుత్వ సర్వీస్ లో ఉంటూ కులాలను రెచ్చగొట్టడం.. రాజకీయ వ్యాఖ్యలు చేయటం సర్వీస్ కు విరుద్ధమంటూ, వాటికి సంబంధించిన సెక్షన్లను రఘురాం కృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సునీల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు పీవీ సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న విషయం తెలిసిందే ఆయనను ఈనెల 4న విచారణకు రావాల్సిందిగా ఎస్పీ దామోదర్ నోటీసులు పంపించారు.