Suryaa.co.in

Andhra Pradesh

దాడి చేసిన ఘటనపై కేంద్ర పార్టీకి నివేదిక

– కర్నూలులో హై కోర్ట్ పెట్టాలన్న డిమాండ్ కు కట్టుబడి ఉన్నాం.
– ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు

రాజధాని ఉద్యమానికి మద్దతు తెలిపితే దాడులు చేస్తారా.ప్లాన్ ప్రకారం భౌతికంగా దాడి చేసి కారు ద్వంసం చేశారు..బద్వేల్లో పోటీ చేసిన మా అభ్యర్థి సురేష్ పై కూడా దాడి చేశారు…విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య…పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా దాడి జరిగింది పోలీసుల సమక్షంలో కొడుతున్న స్పందించలేదు..దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనకు పిలుపునిస్తున్నాం..ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలి.ఎంపి సురేష్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు.. మాపై దాడి చేసి మా వాళ్ళు దాడి చేశారని చెప్తారా.అక్రమ కేసులు బనాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోం…దాడి చేసిన ఘటనపై కేంద్ర పార్టీకి నివేదిక పంపాము.ఇకపై ఇటువంటివి పునరావృతం అయితే ప్రభుత్వం తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. కర్నూలులో హై కోర్ట్ పెట్టాలన్న డిమాండ్ కు మేము కట్టుబడి ఉన్నాం.. హై కోర్ట్ కర్నూలులో పెట్టడానికి ప్రభుత్వం నాన్చివేత దోరణి ఎందుకు అమలు చేస్తుంది సజ్జల సమాధానం చెప్పాలి.. ఇక్కడే రాజదాని కడతా అని చెప్పి ఇప్పుడు మూడు రాజదానులు అని ఎందుకు అంటున్నారు.

LEAVE A RESPONSE