Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

– హిందువులకు సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లీంలకు రంజాన్ లా భారతీయులందరు జరుపుకునే పండగ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య త్రివర్ణ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయులందరికి ఇదొక పర్వదనం. హైందవులకు
tdp-flag సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లీంలకు రంజాన్ లాగా అందరూ కలిపి జరుపుకునే పండగ గణతంత్ర దినోత్సవం. 200 ఏళ్లుగా బ్రిటీష్ కబంధ హస్తాల్లో దేశ నలిగిపోయింది. ఈ సందర్బంగా నాడు జరిగిన పరిస్థితులు మనందరం ఒకసారి గుర్తుతెస్తుకోవాలి. మన దేశంలో మనం రెండో తరగతి ప్రజలుగా, బానిసలుగా బతికిన విధానం మననం చేసుకోవాలి.

స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ఉరికంభం ఎక్కారు. ఎందరో బ్రిటీష్ తుపాకులకు రక్తార్పణం చేశారు. గుజరాత్ లో పుట్టిన వ్యక్తి అహింస నా ఆయుధం అని బ్రిటీష్ వాళ్లతో పోరాడి స్వాతంత్ర్యం సాధించిన వ్యక్తి మహాత్మగాంధీ. ప్రపంచంలో అహింసతో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ మాత్రమే అందుకే ఆయన జాతి పిత అయ్యారు. రవి అస్తమించని సామ్రజ్యమని చెప్పుకున్న బ్రిటీష్ వాళ్లను తరిమి తరమి కొట్టాం. ఆయన మార్గాలు ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తారు. లండన్ లైబ్రరీతో పాటు అనేక దేశాల్లో ఆయన విగ్రహాలు పెట్టారు. నాకు మార్గాన్ని చూపించింది మహాత్మ గాంధీజీ అని నెల్సన్ మండేలా లాంటి గొప్ప వ్యక్తులు చెప్పడం గర్వకారణం. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగం కావాలని బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో ఒక రాజ్యాంగ రచన సంఘాన్ని ఏర్పరిచారు. వారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాజ్యాంగాలను పరిశీలించి బ్రహ్మాంఢమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారు.

1950 జనవరి 26 నుంచి ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన పవిత్ర దినం. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో కొనయాడబడుతుంది. అతి పెద్ద రాజ్యాంగంగా మిగిలిపోయింది. మనం రాజ్యాంగాన్ని ఆయుధంగా తీసుకొని ఉగ్రవాదులను సైతం తరిమికొట్టాం. ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని హక్కులను భారత రాజ్యాంగం కల్పించింది.

ఆనాడు ఎంతో మంది నాయకులు తమ ఆస్తులను పోగొట్టుకొని రాజకీయాలు నడిపి స్వాతంత్ర్యాన్ని తీసుకువస్తే నేడు రాష్ట్రంలో ఆస్తులను కూడబెట్టుకునేందుకు, కక్షలు తీర్చుకునేందుకు, ప్రత్యర్ధులను సాధించుకునేందుకు రాజకీయాలను అడ్డం పెట్టుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా అధికారపక్షం పెద్దలు ప్రవర్తిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. ఏ పార్టీ, ఏ వ్యక్తి అధికారంలోకి ఉన్నా రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరికి బైబిల్, భగవద్గీత, ఖురాన్ ల్లా భావించాలి.

రాజ్యాంగం విలువలు తెలియని వాళ్లు ఇష్టానుసారంగా పాలన చేస్తున్నారు. వారందరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం జగన్ రెడ్డి నేతృత్వంలో వింత పోకడలను పోతుంది. ప్రజా వ్యతిరేక పాలన రాష్ట్రంలో జరుగుతుంది. 95 శాతం హామీలను నెరవేర్చామని గవర్నర్ తో చెప్పిస్తున్నారు. అది పచ్చి అబద్దం. రాష్ట్రం ఆర్ధికంగా అథోగతి పాలయ్యందని మీకు కేంద్రం, ఆర్బీఐలు ఒక్క రూపాయి కూడా ఇవ్వమని కరాఖండిగా చెప్పాయి. రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, వైభవం మీద దాడి జరుగుతుంది. కొంత మంది నాయకులు ధనాస్థి కోసం విదేశీ విష సంస్కృతిని రాష్ట్రంలో తీసుకువస్తున్నారు.

యువతలు అర్ధనగ్నంగా నృత్యాలు చేసిన ధాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇదేంటని ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదు? కొడాలి వెంకటేశ్వరావు (నాని) మాట్లాడుతున్న మాటలు జగన్ రెడ్డికి వినపడం లేదా? ప్రపంచ గర్వించదగ్గ వ్యక్తి చంద్రబాబు నాయుడుగారిపై ఆయన ఇష్టానుసారంగా బూతులు, దుర్భాషాడుతుంటే ముఖ్యమంత్రికి వినిపించడం లేదా? కనీసం తప్పు అని చెప్పలేని దౌర్బాగ్య స్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు. తెలుగు జాతి వైభవాన్ని నలుదిక్కుల్లా వ్యాపింపజేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు వంటి వ్యక్తి పుట్టిన గడ్డలో కోడాలి నాని పుట్టాడు. ఏసుక్రీస్తు పుట్టిన ప్రాంతంలో బంధిపోటు దొంగ బరబ్బా పుట్టాడు, గాంధీజీ పుట్టిన దేశంలోనే గాడ్ సే కూడా పుట్టాడు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతంలో కోడాలి నాని పుట్టడం తెలుగు వారి దురదృష్టం.

క్యాసీనోలో వచ్చిన సొమ్ములో ముఖ్యమంత్రికి ఏమైనా వాటా ఉందా? లేదంటే ఎందుకు దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు. పైపెచ్చు ఒక డీఎస్సీ మీ ఎంక్వైరీ చేయడానికి మరొక డీఎస్పీని పంపుతారా? అది కాకుండా వారిద్దరూ మిత్రులే. అందుకే ఒక పెద్ద సీనియర్ అధికారిని విచారణకు వేయమని కోరుతున్నాం. అందరం రాజ్యాంగ ఔనత్యాన్ని కాపాడేందుకు నడుం బిగించాలి.

ఈ కార్యక్రమంలో పర్చూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దారపనేని నరేంద్ర, డూండీ రాకేష్, సయ్యద్ రఫీ, బుచ్చి రాంప్రసాద్, గంజి చిరంజీవి, వల్లూరి కుమార స్వామి షేక్. హసన్ భాషా, కార్యాలయ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE