– కర్ణాటక లోని గుల్బర్గాలో నిర్వహించిన నారాయణగురు శతజయంతి ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
గుల్బర్గా: బడుగు బలహీన వర్గాలు గురించి, పేద వర్గాల గురించి తపించిన వ్యక్తి నారాయణగురు. సమాజంలో అనేక అసమానతలు తొలగించి మనుషులంతా ఒక్కటే, మనుషులలో వ్యత్యాసం పోవాలంటే, ఆర్థికంగా బలపడాలంటే, సమానత్వం రావాలంటే కేవలం రిజర్వేషన్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
సామాన్యులకు కూడా గుర్తింపు ఇచ్చింది నారాయణగురు. ఈరోజు ఆయన స్ఫూర్తితోనే రిజర్వేషన్లు అనే ప్రక్రియ అమలవుతుంది, దేశంలో మహాత్మ జ్యోతిబాపూలే, నారాయణ గురు, పెరియార్ లాంటి మహనీయుల కృషి వల్లనే మార్పులు వస్తున్నాయి.
స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో ఇప్పుడు కులగణన జరుగుతున్నాయి. కర్ణాటకలో ఎమ్యూరేషన్ ప్రకియ జరుగుతుంది, శాస్త్రీయ పద్దతి కులగణన చేసి రిజర్వేషన్లు కల్పించాలి. కర్ణాటకలో స్థానిక సంస్థల నిర్వహించగా ఆరు ఏండ్లు గడుస్తున్నాయి, ఆలస్యమైన కులగణన చేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి, ఎన్నికలు నిర్వహించారు.
తెలంగాణలో కూడా కులగణన చేశారు, కానీ రిజర్వేషన్ అసంబద్ధంగా చట్ట సవరణ చేయకుండా చేస్తున్నారు, 42% రిజర్వేషన్ తో ఎన్నికలు జరిపిస్తామన్న మాటకు కట్టుబడి ఉండాలి.కర్ణాటకలో రాష్ట్రంలో కులగణనలో, తెలంగాణ రాష్ట్రంలో చేసిన తప్పులు జరగకుండా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలి.
చట్టసభల్లో, విద్యా, ఉద్యోగాలలో, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే భారతదేశంలో ఆర్థిక సమానత్వం వస్తుంది. గుల్బర్గా, తెలంగాణ ప్రాంతాలు అన్ని హైద్రాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 13 నెలలకు హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది.
సెప్టెంబర్ 17వ తేదీతో రాష్ట్రంలో విలీన దినం మరియు తదితర పేర్లతో హైద్రాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజును జరుపుకుంటున్నారు. కళ్యాణ కర్ణాటక (గుల్బర్గా, సేడం, రాయచూర్, బీదర్) తెలంగాణ పరిస్థితులు అన్నీ ఒకటే, ఈ ప్రాంతాలను కలిసిమెలిసి అభివృద్ధి చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో బీకే హరిప్రసాద్, ఎమ్మెల్సీ జగదేవ్ గుత్తేదార్, అశోక్ గుత్తేదార్, ప్రణవానంద స్వామిజీ, నితిన్ గుత్తేదార్, బాలరాజు గుత్తేదార్, వినయ్ గుత్తేదార్, శివకుమార్ పాటిల్ తేల్కూర్, రాజేష్ గుత్తేదార్, సదానంద పార్ల మరియు తదితరులు పాల్గొన్నారు.