Suryaa.co.in

Andhra Pradesh

టిడిపికి 50 వేల విరాళం ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగ దంపతులు

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ దంపతులు టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిసి పార్టీ కి 50 వేల రూపాయల విరాళం ఇచ్చారు. దంపతులైన రిటైర్డ్ ఉద్యోగులు వెంకయ్య, లక్ష్మి కుమారి పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసి 50 వేల రూపాయల విరాళం చెక్ ను అందజేశారు. తమ పెన్షన్ మొత్తం నుంచి పార్టీకి ఈ విరాళం ఇచ్చినట్లు వెంకయ్య దంపతులు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం NTR జిల్లా ఇబ్రహీంపట్నం లో స్థిరపడిన వెంకయ్య, లక్ష్మి కుమారి వేరు ప్రభుత్వ శాఖల్లో పని చేశారు. వెంకయ్య పోలీసు శాఖలో, లక్ష్మి కుమారి R&B లో పని చేసి కొద్ది సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న టీడీపీకి మద్దతుగా నిలవాలని తమ వంతు విరాళం ఇచ్చినట్లు చెప్పిన వెంకయ్య దంపతులు తెలిపారు.

LEAVE A RESPONSE