– ఒక్క డిఏ ఇచ్చి దీపావళి చేసుకో అంటున్నావు
– మేము క్లియర్ చేసిన డీఏ ఇచ్చి గొప్పలు
– ఉసురుపోసుకోని వర్గాలు ఏమైనా ఉన్నాయా?
– సెలవు కావాలంటే సర్వీసు నుండి తొలగిస్తారా?
– రేవ్ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారా?
– నేరస్తుడు పాలకుడు అయితే రేవంత్ పాలన లాగా ఉంటుంది
– రజాకర్ రాజ్యం లెక్కనే రేవంత్ పాలన
– సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: రాష్ట్రంలో 11 నెలల కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన చూస్తే ప్రజాపాలన కాదు ప్రజా పీడన. సీఎం వికృత రూపం బట్టబయలైంది. ఏ వర్గానికి కూడా తాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలతో అట్టుడుకుతున్నది. నోటికి వచ్చినట్లు మాత్రమే మాట్లడమే తెల్సు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నావు.
పంటలు కొనే దిక్కు లేదు. పత్తి ఎక్కడైనా కొనుగోలు చేశారా? 7521 ఏం ఎస్పి అని చెప్పి మోసం చేశారు. క్వింటా 5వేలకు అమ్ముకుంటున్నారు. బోనస్ అని చెప్పి బోగస్ చేసావు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. తక్కువ ధరకు వరి అమ్ముకునే పరిస్థితి. మక్కలు కొనుగోలు దిక్కు లేదు. సోయాబీన్ పంట కొన్నవి కూడా వాపస్ ఇచ్చే పరిస్థితి.
అదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కాళ్ళ మీద పడే దుస్థితి. నిరుద్యోగుల హామీ ఏమైంది. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు అని మోసం చేశారు? ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. తక్షణం పెండింగ్ డీఏ లు, పీ ఆర్ సి అని చెప్పి ఉద్యోగులను మోసం చేసావు. ఒక్క డిఏ ఇచ్చి దీపావళి చేసుకో అంటున్నావు. మేము క్లియర్ చేసిన డీఏ ఇచ్చి గొప్పలు చెబుతున్నావు.
రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో.. బడిలో చదువుకునే పిల్లల నుంచి పింఛన్లు అందుకునే అవ్వాతాతల వరకు అందర్నీ సక్సెస్ ఫుల్ గా రోడ్ల మీదకు తెచ్చినవు. ఉసురుపోసుకోని వర్గాలు ఏమైనా ఉన్నాయా?
ముఖ్యమంత్రికి మెదడులో విషం తప్ప విజన్ లేదు. అవగాహన లేక, పరిపాలన రాక రాష్ట్రాన్ని దివాలా తీశావు. మేము పోరాటం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. నా మీద బాడీ షేమింగ్ చేశారు. మూసి అక్రమాలు బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తే కేటీఆర్ మీద దాడి చేస్తున్నావు. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని పోరాటం చేస్తున్నావు. ఆయన క్యారెక్టర్ దెబ్బ తీసే యత్నం చేసావు.
ఫ్యామిలీ ఫంక్షన్ జరిగితే తప్పుగా ప్రచారం చేస్తున్నారు. రేవ్ పార్టీ జరగకముందే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రేవ్ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారా? దీపావళి పండుగ జరుపుకుంటే దాడి చేశారు. రెయిడ్ చేసిన అధికారులే చెప్పారు. అక్కడ ఏమి దొరకలేదని. దురదృష్టవశాత్తు కొందరు మీడియా కూడా జరగంది, జరిగినట్లు ప్రచారం చేయడం బాధాకరం.మీడియా అలోంచించాలి. మీరు ఎంత భయపెట్టిన మేము పోరాటం ఆపము.
పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్టు చేసే ప్రయత్నం.
కాంగ్రెస్ నాయకులు తమను తామే చంపుకునే పరిస్థితి.నిన్ను కంటికి రెప్పలుగా కాపాడుతున్న వారి మీద ఎందుకు అంత కష్టం? కిరాయి మూకలుగా పోలీసులను ట్రీట్ చేస్తున్నారు. వారిని పిలుచుకొని ఎందుకు మాట్లాడటం లేదు? సెలవు కావాలంటే సర్వీసు నుండి తొలగిస్తారా?
నేరస్తుడు పాలకుడు అయితే రేవంత్ పాలన లాగా ఉంటుంది. పండుగ, పెళ్లిళ్ల సీజన్ లో ఎవరైనా 144 సెక్షన్ పెడతారా? బట్టలు కొనొద్దు, ఫంక్షన్ షాపింగ్ చేయవద్దా? రజాకర్ రాజ్యం లెక్కనే రేవంత్ పాలన ఉంది. కంచెలు లేని పాలన అని ఆంక్షల పాలన తెచ్చారు. ఎస్పీ కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు. పొంకనాలు కొట్టి నేడు ఉన్న ఉద్యోగాలు ఉదగొడుతున్నావు.
అశోక్ నగర్ ను శోక నగర్ గా మార్చింది రేవంత్ రెడ్డి. పిల్లల వీపులు కమిలి పోయే విధంగా కొట్టినవు. ఏ ఊరికైనా పోదాం సన్నవడ్లు కొంటున్నారా? ఏ మూలన పత్తి కొన్నారు. వరంగల్, ఖమ్మం పత్తి మార్కెట్ పోదాం. అవి పట్టించుకోరు కానీ, ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీ అని వికృత ఆనందం పొందుతున్నారు.
బండి సంజయ్ ఆయన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. రేవంత్ తానా అంటే, బండి తందాన అంటున్నాడు. హోం శాఖ మీదే. వాస్తవాలు తెల్సుకుని మాట్లాడు. బాధ్యత పదవిలో ఉంది అవాస్తవాలు మాట్లాడటం కరెక్టేనా? రేవంత్ రెడ్డి తరుపున వకాల్తా పుచ్చుకుంటునావు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కాదు, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారు.
ప్రజల సమస్యల గురించి ఏనాడు మాట్లాడడు. మేనిఫెస్టో గురించి మాట్లాడడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ మంచి కోరుతాడు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ గురించి బిఆరెస్ కొట్లాడితే బీజేపీ ఎందుకు మాట్లాడరు?పోలీసుల సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు? రేవంత్ రెడ్డి అదిగో పులి అంటే, బండి సంజయ్ అదిగో తోక అంటున్నాడు. కేంద్రం నుండి 500 కోట్లు 15 వ ఆర్థిక సంఘం నుండి వస్తే ఎక్కడికి వెళ్లాయి? కాంట్రాక్టర్లకు ఇచ్చారు. 300 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చాయి. ఎందుకు అడగరు?