– ఛత్తీస్ ఘడ్ తో భూ సేకరణ ఒప్పందం కుదుర్చుకోరేం?
– తుమ్మిడి హట్టి పూర్తి కావాలంటే మహారాష్ట్ర తో ఒప్పందం కుదుర్చుకోవాలి
– సమ్మక్క సారక్క బ్యారేజి యంత్ర సామాగ్రి పాడవుతోంది
– బనక చర్ల ఆపేందుకు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు
మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి .రాజయ్య
హైదరాబాద్ : నిన్న భట్టి విక్రమార్క ,ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సీతక్క సమ్మక్క సారక్క బ్యారేజి సందర్శించారు. వాళ్ళు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు. ఓ సబ్ స్టేషన్ ప్రారంభం తప్ప ఏమీ చేయలేదు.
చంద్రబాబు హయంలో తెలంగాణ ఉద్యమ ధాటికి దేవాదులకు శంఖు స్థాపన చేసిన పనులు ప్రారంభించలేదు. కేసీఆర్ హయం లోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా పది శాతం పనులు 20 నెలల కాంగ్రెస్ పాలన గడిచినా పూర్తి చేయలేకపోతున్నారు.
3 వేల ఎకరాల భూ సేకరణ పూర్తి చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. దేవాదుల దగ్గర నీళ్లు లేకపోవడం తో కేసీఆర్ హయం లో రీ ఇంజినీరింగ్ చేసి సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మించారు. ఇక్కడ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు ..ఏ పురోగతి లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం తో సమ్మక్క సారక్క బ్యారేజి యంత్ర సామాగ్రి పాడవుతోంది. . గతం లో మేము ధర్నా చేస్తే తప్ప దేవాదుల మోటార్లు ఆన్ చేయలేదు. మోటార్లు ఆన్ చేసినా పైపులు పగిలిపోయాయి. కేసీఆర్ హయం లో కట్టిన ప్రాజెక్టులను ఫెయిల్యూర్ ప్రాజెక్టులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.
ఛత్తీస్ ఘడ్ తో భూ సేకరణ ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్నపటికీ మంత్రులు ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 22 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు .అన్ని అనుమతులు ఈ ప్రాజెక్టుకు ఉన్నాయి. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ నేతలు కావాలని ప్రచారం చేస్తున్నారు.
అనుమతులు లేని తుమ్మిడి హట్టిని కట్టి తీరుతామని ఉత్తమ్ నిన్న అంటున్నారు. తుమ్మిడి హట్టి పూర్తి కావాలంటే మహారాష్ట్ర తో ఒప్పందం కుదుర్చుకోవాలి దాని గురించి ఉత్తమ్ మాట్లాడటం లేదు.
రేవంత్ తన గురువు చంద్రబాబు ఏజెంట్ గా, బినామీ గా పనిచేస్తూ కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారు. బనక చర్ల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో బనక చర్ల కట్టేందుకు బీ ఆర్ ఎస్ అంగీకరించదు. బనక చర్ల ఆపేందుకు అవసరమైతే ఆందోళన కార్యక్రమాలకు బీ ఆర్ ఎస్ పిలుపు నిస్తుంది.
దేవాదుల ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూనుకుకోకపోతే ధర్నాలు చేస్తాం. గువ్వల బాలరాజు బీ ఆర్ ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. సామాజిక న్యాయం పాటించడం లో అన్ని పార్టీల కన్నా ముందుండే పార్టీ బీ ఆర్ ఎస్. ఆచరణ లో ఇప్పటికే నిరూపించి చూపాం.
ఒక్క రోజు ఖర్చు 50 లక్షలు: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఉమ్మడి వరంగల్ జిల్లా లో నిన్న ఆరుగురు మంత్రుల పర్యటన తో ఒరిగిందేమి లేదు. సమయం ,ప్రభుత్వ ధనం వృధా అయ్యింది .నిన్న ఒక్క రోజు ఖర్చు 50 లక్షల రూపాయలు. మంత్రులు కేవలం విహంగ వీక్షణానికే పరిమితమయ్యారు
దేవాదుల కింద 20 నెలల కాంగ్రెస్ పాలన లో చెంచాడు మట్టి కూడా తీయ లేదు. ఎస్ ఆర్ ఎస్ పి కింద రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. కుట్ర తో కాళేశ్వరం కింద మేడి గడ్డ పంపులు ఆన్ చేయడం లేదు. ఇంజినీర్లు ప్రభుత్వం అనుమతి నిస్తే మోటార్లు ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
93 మీటర్ల ఎత్తున గోదావరి నది ప్రవహిస్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయక పోవడం అసమర్ధత కాదా ? ఎస్ ఆర్ ఎస్ పి 14 లక్షల ఎకరాల ఆయకట్టును ఎందుకు కుదించారు ? ఇంత పెద్ద సమస్యను సమీక్షించే ఓపిక సీఎం ,మంత్రి ఉత్తమ్ కు లేదా ?
కేసీఆర్ హాయం లో ఒక నెల తప్ప పదకొండు నెలలు కాకతీయ మెయిన్ కెనాల్ నిండుగా ప్రవహించేది. ఆయకట్టు నిర్ణయించే శివమ్ కమిటీ ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తామనేది చెప్పలేక పోయారు. ఎన్ని రోజులు సీఎం ,మంత్రులు తప్పించుకుంటారు ? కన్నె పల్లి పంప్ హౌజ్ వద్ద మోటార్లు ఆన్ చేయడానికి సిద్ధం గా ఉన్నామని ఇంజినీర్లు ప్రభుత్వానికి రాసిన లేఖ మా దగ్గర ఉంది . ప్రభుత్వం స్పందించక పోతే ఆ లేఖ మేమే బయటపెడతాం. ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె .వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు