– రైతుల నోట్లో మన్నుకొడుతూ రైతుబంధుని నిలిపివేసే దుర్మార్గమైన కుట్ర చేసిన రేవంత్ రెడ్డి
– దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతురుణమాఫీ పధకాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు కేసీఆర్
-తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బిజెపీ కుట్రలకు తగిన గుణపాఠం చెప్పాలి” అని బిఆర్ఎస్ సీనియర్ నేత డా దాసోజు శ్రవణ్ కోరారు
ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుభీమా, రైతుబంధు, రైతురుణమాఫీ పధకాలకు దాదాపు లక్ష కోట్ల రూపాయిలు ఖర్చు చేశారు కేసీఆర్. గిట్టుబాటు ధరలు, పుష్కలంగా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు వేదికలు ఇలా అద్భుతమై రీతిలో రైతులకు కేసీఆర్ అండగా వుంటే… ఇది చూసి ఓర్వలేని రేవంత్ కాంగ్రెస్, బిజేపీతో కుమ్మకై ఎన్నికల కమీషన్ పై ఒత్తిడి తెచ్చి దుర్మార్గంగా వ్యవహరించింది. రైతుబందు వస్తే రేవంత్ ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు ? రైతులు చల్లాగా వుంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కడుపుమంట ? రేవంత్ రెడ్డి ఎందుకు రైతు బంధుని ఆపే కుట్ర చేస్తున్నాడు ? అని ప్రశ్నించారు.
రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే అక్టోబర్లో భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో కేసీఆర్ గారు రైతుబందు నిరంతరంగా సాగే పధకం. రైతులు విత్తనాలు వేసే ఈ సమయంలో వాళ్లకి అప్పులు, వడ్డీ బెడద లేకుండా వుండాలంటే ఖచ్చితంగా పధకం అమలు కావాలని ప్రజంటేషన్ ఇవ్వడంతో ఈసీ అనుమతి ఇచ్చింది.
ఈ అనుమతి రాగానే రేవంత్ రెడ్డి మళ్ళీ రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీకి లేఖ రాశారు. తాజాగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కూడా రైతు బంధుపై ఫిర్యాదు చేశారు. చిల్లర రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ లక్షలాది రైతుల జీవితాలతో చెలగాటమాడడం అన్యాయం’’అని మండిపడ్డ దాసోజు శ్రవణ్… రైతు బంధు సొమ్ము పంపిణీని కాంగ్రెస్ నేతలు ఎలా అడ్డుకున్నారో ఆధారాలతో సహా మీడియాకు చూపించారు.
లేఖ రాసిన రేవంత్ రెడ్డి సిగ్గు శరం లేకుండా ఇది తన లేఖ కాదని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్మువుంటే లేఖరాశామని ఒప్పుకోవాలి. దొంగ రాజకీయాలు ఎందుకు ? నిన్నటి వరకూ రేటంత రెడ్డిగా వున్న రేవంత్.. ఈ రోజు రైతుల పాలిట రాబంధు రెడ్డిగా మారిండు’’ అని ధ్వజమెత్తారు దాసోజు.
గతంలో ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తుంటే కోర్టులో కేసులు వేసి అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ. 24 కరెంట్ ఇస్తామంటే ఇవ్వలేరని అపహాస్యం చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి రైతులకు అండగా చేపట్టే కార్యక్రమాలకు అడ్డుతగులుతూనే వుంది. అసలు రైతులు ఆనందంగా వుంటే రేవంత్ కాంగ్రెస్ కి వచ్చే నష్టం ఏమిటి ? చిల్లర రాజకీయాల కోసం రైతుల నోట్లు ఎందుకు మన్నుకొడుతున్నారు ? అని ప్రశ్నించారు.
రైతుబంధుని ఆపు చేయించిన రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గల్లాపట్టి నిలదీయాలి. రైతుబంధు నిలిపివేశారని ఎందుకు లేఖరాశారో ప్రశ్నించాలి. కౌలు రైతులకు, భూయజమానులకు ఇద్దరికీ కూడా ఒకే ఎకరం మీద డబ్బులు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఇద్దరినోట్లో మన్ను కొట్టే కుట్ర చేస్తోంది. రైతుబంధుని భూస్థాపితం చేసే కుట్ర చేస్తోంది కాంగ్రెస్. ఐతే ఇది మూడు రోజు ఆగొచ్చు. మూడో తారీకు తర్వాత కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి ఆయన తర్వాత రైతుబంధు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కుటిల రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం’’ అని వెల్లడించారు డా దాసోజు శ్రవణ్.