Suryaa.co.in

Telangana

సాయిరెడ్డి బలవన్మరణానికి రేవంత్ సోదరులదే బాధ్యత

– మరణ వాంగ్మూలం ఆధారంగా వారిపై కేసు పెట్టాల్సిందే
– బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్

హైదరాబాద్: కన్నుమిన్నుకానని అధికార అహంకారంతో ప్రజాపాలన పేరుమీద నిరంకుశ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్న నియంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన సోదరులు తన స్వంత గ్రామ కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పి. సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకునే బలీయమైన పరిస్థితులు కల్పించడం వారి రాక్షస మనస్తత్వానికి , వారి నేర ప్రవృత్తికి నిదర్శనం.. సాయిరెడ్డి మరణ వాగ్మూలం ఆధారంగా రేవంత్ రెడ్డి తో సహా అతని సోదరులపై ఆత్మహత్యా ప్రేరేపణ సెక్షన్ 108, భారత న్యాయ సంహిత ఆధారంగా కేసు నమోదు చేయాలి. నేరస్తులను కఠినంగా శిక్షించాలి.

LEAVE A RESPONSE