– రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా?
– న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: న్యాయవాది భూములకే ఎసరు పెట్టిన సీఎం సోదరులు!! న్యాయం చేయాల్సిన ఖాకీలు సీఎం సోదరులతో సెటిల్ చేసుకోమంటారా? రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా? న్యాయవాదికే న్యాయం దక్కకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఓ వైపు రాష్ట్రంలో ఉన్న సోదరులకు తెలంగాణ ఆస్తులను దోచి పెడుతూ..మరోవైపు అమెరికాలో తమ్ముడి కంపెనీతో 1000 కోట్ల ఒప్పందంతో ఏం సందేశం ఇస్తున్నట్లు? రాకేష్ రెడ్డి తండ్రి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పని చేసినందుకు మీరు ఆ కుటుంబానికి ఇచ్చిన బహుమానం ఇదేనా?