– రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా నీ ముఖానికి వ్యవసాయం చేశావా?
– యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం
– రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్
– రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు.
– సీఎం, ఎమ్మెల్యేలకు లేని చెక్ పవర్ ఒక్క గ్రామ సర్పంచ్‌కే ఉంది. ధైర్యంగా పనిచేయండి.
– ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మనుమడి సోకుల కోసం 100 కోట్లతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిస్తారా?
– ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి కోపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదు.
– రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు చక్కర్లు కొట్టే ఫ్లయింగ్ సీఎం.
– రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
– సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు..
సంగారెడ్డి : ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయి.. కారు జోరు కాంగ్రెస్ బేజారు. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీ 90% గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తాయి. కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థానాలను గెలిచింది. సంగారెడ్డిలో 34 సర్పంచులు గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు రేవంత్ రెడ్డి.
రాజకీయాల్లో అబద్దాలు ఆడడంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 50 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 66% గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలని ఎదురుచూస్తున్నారు.
రేవంత్ రెడ్డి ముఖానికి ఎరువులు ఇచ్చే తెలివి లేదు. పంట పండాలంటే నీళ్లు కావాలి. కరెంటు కావాలి. ఎరువులు కావాలి. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు. అప్పులు లు కావాలి మ్యాపులు కావాలి అంటున్నాడు. ఎరువు బస్తాలు కావాలంటే యాప్ లో కొట్టండి అంటున్నాడు. రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా నీ మొఖానికి వ్యవసాయం చేసావా? రైతుల కష్టం మీకు తెలుసా? కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్లు. నీళ్లు ఫుల్లు. ఎరువులు ఫుల్లు.
రేవంత్ రెడ్డి వచ్చినంక రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు, కరెంటు 14 గంటలు కూడా వస్తలేదు, ఎరువుల కోసం లైన్ లో నిలబడి నిలబడి గోసపడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల లారీలను ఊర్లకే పంపి రైతులకు అందించాడు. రేవంత్ రెడ్డి వచ్చినంక ఎరువుల కోసం గంటల తరబడి లైన్ లో నిలబడాల్సిన దుస్థితి. ఇప్పుడు కొత్తగా యాప్ లో బుక్ చేసుకోవాలి అంటున్నాడు.
యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిండు. రుణమాఫీ సగం మందికి కూడా చేయలేదు. మున్సిపాలిటీల టైం అయిపోయి సంవత్సరం అవుతున్నా ఎన్నికలు పెట్టట్లేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుంది.
కోపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కూడా కాంగ్రెస్ నాయకులను నామినేట్ చేసుకుందామని జీవో ఇచ్చిండు. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నువ్వు రైతులకు మేలు చేసెటోడివే అయితే కోపరేటివ్ ఎన్నికలు పెట్టు. ఎందుకు నామినేట్ చేస్తున్నావ్. నువ్వు ఎరువులు ఇయ్యలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు ఎగ్గొట్టినవ్. బోనస్ డబ్బులు ఇయ్యలేదు. పంటల బీమా చేయలేదు కనుక ఎలక్షన్ పెట్టట్లేదు.
మనం కూడా ప్రజల్లోకి పోదాం. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85% ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయి. రేవంత్ రెడ్డి, మంత్రులు ఆపలేరు. ఎమ్మెల్యే ఆపలేడు. డైరెక్ట్ సర్పంచుల ఎకౌంట్లో పడతాయి. సర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎమ్మెల్యేకి చెక్ పవర్ లేదు. మంత్రికి చెక్ పవర్ లేదు. ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు. కానీ గ్రామ సర్పంచ్‌కు చెక్ పవరుంది.
ధైర్యంగా పని చేయండి. త్వరలో గెలిచిన సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు పెడతాం. సర్పంచ్ విధివిధానాలు, బాధ్యతలపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం. ఏమున్నా రెండేళ్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్ గా గెలిచారు. మీ పదవీకాలంలో మల్ల మూడేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారు. మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంతవరకి చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాంగనే నేను దగ్గరుండి మీ పనులు చేయించే బాధ్యత నాది.
ప్రజలకు అందుబాటులో ఉండాలి. తలలో నాలుకలా ఉండాలి. ఓడిపోయిన వారికి భవిష్యత్తు ఉంటది. గెలిచిన వారికి బాధ్యత ఉంటుంది. ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఓపికతో ఉండాలి. నిన్నటి వరకు దండం పెట్టి ఓటు అడిగి గెలువంగానే మారిపోకూడదు.
మొన్న రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడిండు. రేవంత్ రెడ్డి.. ఆయన మనుమడు సోకు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్‌బాల్ ఆడిండు. సింగరేణి కార్మికుల 10 కోట్ల డబ్బును ఫుట్‌బాల్ మ్యాచ్ కి పెట్టిండు. గవర్నమెంట్ ఖజానా నుంచి ఐదు కోట్లతో ఫుట్‌బాల్ గ్రౌండ్ కట్టుకున్నాడు సొంతంగా. నీ సొంత డబ్బుతో కట్టుకో రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేయడం కాదు. సింగరేణి సీఎస్సార్ డబ్బులతో కేసీఆర్ స్కూళ్లు కట్టించిండు. రోడ్లు ఏపించిండు. మెడికల్ కాలేజీలు పెట్టించిండు.
కొత్త జిల్లాలు చేయాలి. కొత్త మెడికల్ కాలేజీ చేయాలి. మండల కేంద్రానికి రోడ్లు వేయాలని కేసీఆర్ పని చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో అందాల పోటీలు పెట్టాలి. ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాలి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో సోకులు చేయాలి. ఢిల్లీకి హైదరాబాద్ కి చక్కర్లు కొట్టాలి. కేసీఆర్ ప్రతిక్షణం నా తెలంగాణ ఎట్ల పైకి రావాలని తపనపడ్డాడు. అందాల పోటీలతో, ఫుట్‌బాల్ పోటీలతో మనకేమైనా వచ్చిందా?
ఊర్లలో వీధి దీపాలు పోతే చేయడానికి డబ్బులు లేవు. కేసీఆర్ గెలిచిన వెంటనే 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసిండు. 4000 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఉన్న 2000 కూడా సక్కగా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు ఫ్లయింగ్ సీఎం. యూరియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం.