Suryaa.co.in

Telangana

కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు

-కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడు
-9 న బీఆరెస్ ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది
-పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దు
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

నకిరేకల్ : తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు.ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో కేసీఆర్ ముందుకెళ్లిండు. కానీ వెంకట్ రెడ్డి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు. చిరుమర్తి లింగయ్యను రెండుసార్లు గెలిపిస్తే, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల గుండెలపై తన్నిండు. పార్టీ ఫిరాయించి దొరగారి గడీలో మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు.

పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దు.అక్కడి సూర్యుడు ఇక్కడమొలిచినా.. ప్రాణం పోయినా.. ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనివ్వొద్దు. ఇప్పుడు మీరు ఇవ్వబోయే తీర్పు వందేళ్ల వరకు చరిత్రలో నిలిచిపోవాలి. ఆనాడు వెంకన్న వైఎస్ తో కొట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టు మంజూరు చేయించారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 కిలోమీటర్లు టన్నెల్ తవ్వారు. ఇంకో పది కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చేవి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పడావు పెట్టారు.

నకిరేకల్ వేదికగా కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా… ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలేదు కేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు. 60 ఏళ్లల్లో 16 మంది సీఎం లు చేసిన అప్పు 69 వేల కోట్లు. కానీ పదేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసిన అప్పు 6 లక్షల కోట్లు. ఎవడు దొంగ.. ఎవడు గజదొంగ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.

కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడు. నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా. ఉమ్మడి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. వెంకట్ రెడ్డి, నేను ఇద్దరం అనుకుంటే.. ఈ ప్రాంతంలో బీఆరెస్ జెండా ఎక్కడా కనిపించదు.బీఆరెస్ లో ఎవ్వరూ గెలవరు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించండి. కేసీఆర్ ను డిసెంబర్ 9 న బీఆరెస్ ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది.

LEAVE A RESPONSE